https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విక్టరీ సెలెబ్రేషన్స్ లో సాయి ధరమ్ అల్లరి… మామయ్యల రియాక్షన్ చూడండి!

Pawan Kalyan: జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో విజయం సాధించింది. వంద శాతం స్ట్రైక్ రేట్ తో జనసేన సత్తా చాటింది. దీంతో అభిమానులు, కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : June 7, 2024 / 02:18 PM IST

    Sai Dharam hungama in Pawan Kalyan Victory Celebrations

    Follow us on

    Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో మెగా ఫ్యామిలీలో(Mega Family) పండుగ వాతావరణం నెలకొంది. చిరంజీవి(Chiranjeevi) ఇంట పవన్ కళ్యాణ్ విక్టరీ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సదరు వీడియో చూసిన మెగా అభిమానులు సంతోషంతో ఉప్పొంగి పోతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచారు.

    జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో విజయం సాధించింది. వంద శాతం స్ట్రైక్ రేట్ తో జనసేన సత్తా చాటింది. దీంతో అభిమానులు, కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ భార్య, కొడుకు అకీరా నందన్(Akira Nandan) తో వెళ్లి మోదీ ని కలిశారు. ఇక అనంతరం జనసేన అధినేత చిరంజీవి ఇంటికి వచ్చారు. మెగా ఫ్యామిలీ పవన్ కు ఘన స్వాగతం పలికారు. ఆయన పై పూల వర్షం కురిపించారు.

    Also Read: Sandeep Reddy Vanga: ఇప్పుడే కాదు సందీప్ రెడ్డి వంగ ను మించిన డైరెక్టర్లు ఇంకా మీదట కూడా రాలేరా..?

    చిరంజీవి సతీమణి సురేఖ హారతి ఇచ్చి పవన్ ని లోపలికి ఆహ్వానించారు. చిరంజీవి కాళ్లపై పడి పవన్ ఆశీర్వాదం తీసుకున్నారు. తమ్ముడిని ఆప్యాయంగా హత్తుకున్నాడు చిరు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందడిలో సాయి ధరమ్ తేజ్, కొడుకు అకీరా నందన్ కలిసి తెగ అల్లరి చేశారు. పవన్ కేక్ కట్ చేస్తున్న సమయంలో సాయి ధరమ్ తేజ్ వెనుక ఉండి విజిల్స్ వేశాడు. ఆపకుండా విజిల్స్ వేస్తూనే ఉన్నాడు.

    Also Read: Pushpa 2: పుష్ప 2 సినిమాకు తప్పని రీ షూట్లు…కారణం ఏంటి..?

    సాయి ధరమ్ అల్లరి చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఒక లుక్ ఇచ్చారు. దాంతో తేజ్ సైలెంట్ అయిపోయాడు. సారీ మావయ్య అని చెప్పాడు. తర్వాత పవన్ కళ్యాణ్ తన తల్లి, వదినమ్మ కాళ్ళకి నమస్కారం చేసుకున్నాడు. ఇలా మెగా ఫ్యామిలీ అంతా కలిసి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.