https://oktelugu.com/

Mahesh Babu-Rajamouli: మహేష్ బాబు రాజమౌళి కాంబో లో వచ్చే సినిమా టైటిల్ ఇదేనా..?

Mahesh Babu-Rajamouli: రాజమౌళి మహేష్ బాబుని ఎలాంటి క్యారెక్టర్ లో చూపిస్తున్నాడు అనేది కూడా ఇప్పుడు ప్రేక్షకుల్లో అసక్తి రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ఇది అడ్వెంచర్ జానర్ కు సంబంధించిన సినిమా కావడం...

Written By: , Updated On : June 7, 2024 / 02:25 PM IST
Mahesh Babu-Rajamouli Movie Title

Mahesh Babu-Rajamouli Movie Title

Follow us on

Mahesh Babu-Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) ప్రస్తుతం ఏది చేసిన ఒక పెను సంచలనంగానే మారుతుంది. ఇంకా ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసిన రాజమౌళి తొందర్లోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన ఒక ప్రెస్ మీట్ ను పెట్టి సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని చూస్తున్నాడు.

మరి అందులో భాగంగానే రాజమౌళి మహేష్ బాబుని(Mahesh Babu) ఎలాంటి క్యారెక్టర్ లో చూపిస్తున్నాడు అనేది కూడా ఇప్పుడు ప్రేక్షకుల్లో అసక్తి రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ఇది అడ్వెంచర్ జానర్ కు సంబంధించిన సినిమా కావడం వల్ల ప్రతి సీన్ కూడా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తూ విజిల్స్ వేయించే విధంగా తీర్చిదిద్దబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే విజయేంద్రప్రసాద్ ఈ కథని హై ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ తో కూడిన కథ గా తీర్చిదిద్దాడట.

Also Read: Sandeep Reddy Vanga: ఇప్పుడే కాదు సందీప్ రెడ్డి వంగ ను మించిన డైరెక్టర్లు ఇంకా మీదట కూడా రాలేరా..?

ఇక దానికి తగ్గట్టుగానే రాజమౌళి కూడా ఈ సినిమాని సూపర్ సక్సెస్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ ను పెదుతున్నారు. అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక రాజమౌళి సినిమా అంటే టైటిల్ పవర్ ఫుల్ గా ఉంటుంది. అందుకోసమే ఆయన పలు రకాల టైటిల్స్ ని పరిశీలిస్తున్నాడట. ఇక అందులో ‘డ్రాగన్'(Dragon) అనే పేరు అయితే వినిపిస్తుంది. ఇక తెలుగులో పేరుని పెడితే పాన్ వరల్డ్ ప్రేక్షకులకు రీచ్ అవ్వదు.

Also Read: Pushpa 2: పుష్ప 2 సినిమాకు తప్పని రీ షూట్లు…కారణం ఏంటి..?

కాబట్టి అక్కడ ఇక్కడ ఒకే పేరు వచ్చేలా ఒక ఇంగ్లీష్ టైటిల్ నే ఈ సినిమా కోసం సెలెక్ట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే డ్రాగన్ అనే పేరు ను ఈ సినిమాకి ఫైనల్ చేయాలనే ఉద్దేశ్యంలో రాజమౌళి చూస్తున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమాకు రాజమౌళి ఎలాంటి టైటిల్ ను పెడతాడు అనేది…