Tollywood: అల్లు అర్జున్ ప్రభాస్ ఎన్టీయార్ రామ్ చరణ్ ఈ నలుగురి లో ఎవరి మార్కెట్ ఎంత..?

Tollywood: మన ఇండస్ట్రీ లో ఉన్న నలుగురు స్టార్ హీరోలు పాన్ ఇండియాలో వాళ్ళ సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక అందులో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు ఉన్నారు.

Written By: Gopi, Updated On : June 7, 2024 2:44 pm

Allu Arjun Prabhas NTR Ram Charan

Follow us on

Tollywood: ప్రస్తుతం తెలుగు హీరోలందరూ పాన్ ఇండియా మార్కెట్ మీద పడి వరుస సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే ఈ క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలు ఎలాంటి విజయాలను సాధిస్తున్నాయి. ప్రేక్షకులను ఎంతవరకు ఎంగేజ్ చేస్తున్నాయి. అనే విధంగా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటూ మన హీరోలు వాళ్ల సాధ్యమైన మేరకు ప్రేక్షకులను మెప్పించే సినిమాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే లో మన ఇండస్ట్రీ లో ఉన్న నలుగురు స్టార్ హీరోలు పాన్ ఇండియాలో వాళ్ళ సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక అందులో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు ఉన్నారు. అయితే ఈ నలుగురిలో ఎవరి మార్కెట్ ఎంత ఇప్పుడు రాబోయే సినిమాలతో ఎవరు ఎంత వసూళ్లను కలెక్ట్ చేయబోతున్నారు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

ప్రభాస్(Prabhas)

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాతో మరోసారి పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా 600 కోట్ల బడ్జెట్ తో దాదాపు 1600 కోట్ల వరకు కలెక్షన్లను రాబడుతుందనే అంచనాలో అయితే సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది…

రామ్ చరణ్(Ram Charan)

త్రిబుల్ ఆర్ సినిమాతో హీరోగా మారడమే కాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో రామ్ చరణ్…ఈయన ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టాలని చూస్తున్నాడు. ఇక దానికోసమే తీవ్రమైన కసరత్తులను కూడా చేస్తున్నాడు…

Also Read: Telugu Film Industry: ఈ 6 నెలల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏం జరిగింది..?

ఎన్టీయార్(NTR)

కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమా కూడా ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా కూడా 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతోంది…

అల్లు అర్జున్(Allu Arjun)

ఇక పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారడమే కాకుండా వరల్డ్ వైడ్ గా 300 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో 1200 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా మీద రోజు రోజుకి అంచనాలు భారీగా పెరుగుతూ ఉండటం వల్ల ఈ సినిమా ఈజీగా భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తుంది. అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…

Also Read: Mahesh Babu-Rajamouli: మహేష్ బాబు రాజమౌళి కాంబో లో వచ్చే సినిమా టైటిల్ ఇదేనా..?

ఇక ఈ నలుగురు స్టార్ హీరోల్లో ప్రస్తుతానికైతే ప్రభాసే వీళ్ళందరూ కంటే పై చేయి సాధిస్తూ భారీ వసూళ్లను రాబట్టే విధంగా ముందుకు సాగుతున్నాడు.. మరి ఈ సినిమాలు రిలీజ్ అయితే ఈ స్టార్ హీరోలా పొజిషన్స్ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి…