https://oktelugu.com/

Jailer 2: జైలర్ 2 లో కనిపించనున్న తెలుగు స్టార్ హీరోలు వీళ్లే…

Jailer 2: నెల్సన్ డైరెక్షన్ లోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ చేసిన గెస్ట్ అప్పిరియన్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి.

Written By:
  • Gopi
  • , Updated On : June 7, 2024 / 02:32 PM IST

    Telugu star heroes who will be seen in Jailer 2

    Follow us on

    Jailer 2: రజనీకాంత్(Rajinikanth) హీరోగా గత సంవత్సరంలో వచ్చిన జైలర్ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ తో రజనీకాంత్ వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇక ఇప్పటికే ఆయన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ‘కూలీ'(Coolie) అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా జైలర్ 2 అనే మరొక సినిమాని కూడా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా జైలర్ సినిమా(Jailer Movie) కి సీక్వెల్ గా వస్తుంది.

    ఇక నెల్సన్ డైరెక్షన్ లోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ చేసిన గెస్ట్ అప్పిరియన్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఇక దానికి తగ్గట్టుగానే జైలర్ 2 సినిమాలో కూడా అలాంటి పాత్రలనే రీ క్రియేట్ చేయాలని దర్శకుడు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులను తీసుకోవాలని తను ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రజనీకాంత్ కి అండగా ఈసారి బాలకృష్ణ(Balakrishna) గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.

    Also Read: Mahesh Babu-Rajamouli: మహేష్ బాబు రాజమౌళి కాంబో లో వచ్చే సినిమా టైటిల్ ఇదేనా..?

    ఇక ఆయనతో పాటుగా దగ్గుబాటి రానా(Daggubati Rana) కూడా ఒక స్పెషల్ పాత్రలో నటించి మెప్పించబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక జైలర్ 2 సినిమాలో ఇద్దరూ తెలుగు స్టార్లే కనిపిస్తున్నందుకు తెలుగు వాళ్ళమైన మనం గర్వించాల్సిన విషయమనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో బాలయ్య బాబు చేత క్యారెక్టర్ వేయించడానికి రజనీకాంత్ ఆల్రెడీ ఆయన్ని అప్రోచ్ అయి ఆయనకు క్యారెక్టర్ గురించి వివరిస్తూ ఆ పాత్ర తాలూకు ఇంపార్టెన్స్ ను కూడా వివరించారట.

    Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విక్టరీ సెలెబ్రేషన్స్ లో సాయి ధరమ్ అల్లరి… మామయ్యల రియాక్షన్ చూడండి!

    అయితే ఈ పాత్ర జస్ట్ గెస్ట్ రోల్ గా మాత్రమే కాకుండా సినిమాలో ఒక 15 నిమిషాల పాటు కనిపించే క్యారెక్టర్ కావడం వల్ల బాలకృష్ణ పాత్ర కు కూడా చాలా మంచి స్కోప్ అయితే ఉండబోతుందని తెలుస్తుంది…చూడాలి మరి బాలయ్య రజినీకాంత్ కాంబోలో వచ్చే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది…