Vijay Deverakonda: టాలెంట్ కి అదృష్టం కూడా తోడైతే వాళ్ళని ఆపడం కష్టమే. ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ఆ క్రేజ్ కొనసాగిస్తున్నారు. ‘పెళ్లి చూపులు’ మూవీతో మొదటి హిట్ అందుకున్న విజయ్ ‘అర్జున్ రెడ్డి’ మూవీతో స్టార్ అయ్యారు. ఇక ‘గీత గోవిందం’ ఆయనకు అమ్మాయిలలో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. మూడు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన విజయ్ దేవరకొండ ఇమేజ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోదు.

అయితే విజయ్ దేవరకొండ బాలీవుడ్ భామలను ఆకర్షించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. విజయ్ దేవరకొండ హిందీలో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినప్పటికీ బాలీవుడ్ కుర్ర హీరోయిన్స్ మాత్రం విజయ్ దేవరకొండపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సౌత్ లో మీకు నచ్చిన స్టార్స్ ఎవరంటే టక్కున విజయ్ దేవరకొండ పేరు చెప్పేస్తున్నారు.టాప్ హీరోయిన్ అలియా భట్ ఓ సందర్భంలో విజయ్ దేవరకొండ తన ఫేవరెట్ స్టార్ అని చెప్పారు.
ఆ తర్వాత శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కూడా విజయ్ దేవరకొండపై అభిమానం చాటుకున్నారు. అతనితో నటించాలని ఉందన్న అభిప్రాయం వెల్లడించారు. ఇక కియారా అద్వానీ విషయానికి వస్తే.. ఆమె దేవరకొండకు చాలా క్లోజ్. ముంబైలో కలిసి పార్టీలలో కూడా పాల్గొంటారు. ఆమె సైతం విజయ్ దేవరకొండపై తనకున్న ఇంట్రెస్ట్ పలుమార్లు బయటపెట్టారు.
తాజాగా ఈ లిస్ట్ లో స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ చేరింది. ప్రముఖ్ బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న సారా అలీఖాన్ విజయ్ దేవరకొండను పొగడ్తలతో ముంచెత్తింది. ప్రస్తుతం ఆమె ‘అత్రాంగి రే’ మూవీలో ధనుష్ కి జంటగా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధనుష్ కాకుండా… మీరు నటించాలని కోరుకుంటున్న సౌత్ హీరో ఎవరని అడుగగా… ఆమె తడుముకోకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పింది.
Also Read: శ్యామ్ సింగరాయ్ శాటిలైట్ రైట్స్ కు భారీ డీల్…
విజయ్ దేవరకొండతో స్క్రీన్ పంచుకోవాలని ఉందన్న ఆమె… విజయ్ దేవరకొండ గ్రేట్ యాక్టర్. అలాగే చాలా హాట్ కూడా. అతనితో నటించాలని కోరుకుంటున్నాను, అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్ లో సూపర్ స్టార్స్ ని కాదని సారా అలీఖాన్ విజయ్ దేవరకొండతో నటించాలని కోరుకోవడం విశేషమే.
అదే సమయంలో బాలీవుడ్ కుర్ర హీరోయిన్స్ విజయ్ దేవరకొండను మాత్రమే కోరుకోవడం వెనుక కారణం ఏమిటోనని చర్చించుకుంటున్నారు. లైగర్ మూవీతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ఉండగా… ఆయన ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.
Also Read: స్క్రిప్ట్ మొత్తం ఇచ్చెయ్యమంటారా?.. మీడియాపై రాజమౌళి సెటైర్