Homeఎంటర్టైన్మెంట్RRR PressMeet: కొమరం భీమ్​గా నన్ను తీర్చిదిద్దింది ఆయనే- తారక్​

RRR PressMeet: కొమరం భీమ్​గా నన్ను తీర్చిదిద్దింది ఆయనే- తారక్​

RRR PressMeet: దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మెగా, నందమూరి ఫ్యామిలిలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు.

పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ట్రైలర్​ను నిన్న విడుదల చేసింది చిత్రబృందం. రిలీజ్​ అయిన కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్​కు చేరుకుని.. ప్రభంజనం సృష్టించింది. కేవలం 7 గంటల్లోనే టాలీవుడ్​ ఫాస్టెస్ట్​ 1 మిలియన్​ లైక్స్​ ట్రైలర్​గా నిలిచి.. ఆల్​టైమ్​ నెంబర్​ 1 స్థాయిలో నిలిచింది. ఇప్పుడు 20 మిలియన్ వ్యూస్​కు చేరువలో ఈ ట్రైలర్​ నెట్టింట దూసుకెళ్లిపోతోంది.

కాగా తాజాగా హైదరాబాద్​లో  మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆర్​ఆర్​ఆర్​ టీమ్​.. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు రాజమౌళితో పాటు చరణ్​, తారక్​ ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే భీమ్ పాత్రకోసం ఎంతగా శ్రమించారని అడగ్గా.. తారక్​ స్పందిస్తూ.. అది చెప్పడం కూడా కష్టమేనని.. భీమ్ పాత్రలో ఆయన భాష, మాటతీరు, నడక, మనస్తత్వం ఇలా అన్ని కోణాల్లో నన్ను తీర్చి దిద్దించి మాత్రం జక్కన్నేనని అన్నారు తారక్​. కేవలం కండలుంటే సరిపోదని.. గుండెబలం కూడా అవసరమని ఈ పాత్ర చెబుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు పులితో పోరాట సన్నివేశాల గురించి మాట్లాడుతూ.. నా ముందున్న పులి కంటే.. ఆ పులి వెనకున్న పెద్ద పులి రాజమౌళి అని.. ఆ సమయంలో ఆయనకే నేను భయపడ్డా అని సరదాగా కామెంట్​ చేశారు ఎన్టీఆర్​.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper