అయోమయంలో సుక్కు.. పుష్పకి స్టార్ కావాలట !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో చేస్తోన్న ‘పుష్ప’ సినిమాలో తమిళ స్టార్ విజయ్‌ సేతుపతి ఓ పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌ గా నటించాలి, కరోనా లేకపోయి ఉండి ఉంటే.. విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో నటించేవాడే. కానీ డేట్స్ ఎడ్జెస్ట్ కాకనే పుష్ప సినిమా నుండి తప్పుకోవాల్సి వస్తోంది అంటూ విజయ్ సేతుపతి బన్నీకి సారీ చెప్పేశాడు. ఈ విషయం గురించి రీసెంట్ గా ఓ ఆంగ్ల పత్రికకు […]

Written By: admin, Updated On : October 4, 2020 5:55 pm
Follow us on


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో చేస్తోన్న ‘పుష్ప’ సినిమాలో తమిళ స్టార్ విజయ్‌ సేతుపతి ఓ పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌ గా నటించాలి, కరోనా లేకపోయి ఉండి ఉంటే.. విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో నటించేవాడే. కానీ డేట్స్ ఎడ్జెస్ట్ కాకనే పుష్ప సినిమా నుండి తప్పుకోవాల్సి వస్తోంది అంటూ విజయ్ సేతుపతి బన్నీకి సారీ చెప్పేశాడు. ఈ విషయం గురించి రీసెంట్ గా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చాడు. దాంతో సుకుమార్ కి ఉన్న క్లారిటీ మిస్ అయింది. అసలుకే సుక్కు ఒక పాత్రకు నటుడిని సెలెక్ట్ చేయడానికి బోలెడు టైం తీసుకుంటాడు. దానికితోడు కరోనా.. మొత్తానికి విజయ్‌ సేతుపతి ప్లేస్ లో ఎవర్నీ తీసుకోవాలో.. అసలు ఎవరు చేయడానికి రెడీగా ఉన్నారో అనే మీమాంసలోనే సుక్కు గత నెల నుండి కాలక్షేపం చేస్తున్నాడట.

Also Read: బాలయ్య కోసం వారణాసి ప్రయాణం !

తరువాత మొదలెట్టబోయే షెడ్యుల్ లో విజయ్‌ సేతుపతి రోల్ కి సంబధించిన సీన్స్ ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఆ పాత్రకు ఓ స్టార్ ను ఫైనల్ చేయాలి. మాధవన్ ను తీసుకోబోతున్నారని వార్తలు వస్తోన్నా దానిలో నిజం లేదని తెలుస్తోంది. మాధవన్ ఓ తమిళ సినిమా కోసం ఏప్రిల్ లో ఇరవై రోజులు, ఓ హిందీ సినిమాకి జూన్ లో పదిహేను రోజులు డేట్స్ ఇచ్చాడు. అయితే కరోనా వైరస్ కారణంగా ఆ షూట్స్ క్యాన్సల్ అవ్వడంతో మాధవన్ డేట్స్ క్లాష్ అయ్యాయి. కాబట్టి ముందు ఒప్పుకున్న సినిమాలు చేయాలి అని పుష్ప సినిమా ఆఫర్ వచ్చినా మాధవన్ చేయలేను అని చెప్పాడట. కాగా ఇప్పుడు ఈ పాత్రలో వివేక్ ఒబెరాయ్ ను తీసుకోవాలని చూస్తున్నారట పుష్ప టీమ్.

Also Read: కరాటేకు పూర్వ వైభవం రావాలి: హీరో విశ్వక్ సేన్

అయితే వివేక్ ఒబెరాయ్ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు గానీ, పుష్ప టీంకి సంబంధించిన వ్యక్తుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం అయితే ‘వివేక్ ఒబెరాయ్’ అయితే పుష్పకి పాన్ ఇండియా సినిమా అనే బ్రాండ్ కూడా వస్తోందని.. అందుకే వివేక్ ఒబెరాయ్ ను ఎలాగైనా ఈ సినిమాలో చేసేలా ఒప్పించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. కానీ వివేక్ ఒబెరాయ్ తెలుగు సినిమాల పై ఇంట్రస్ట్ చూపించడం లేదు. మరి బన్నీ కలలు కన్న పాన్ ఇండియా సినిమా కోసమైనా వివేక్ ఒబెరాయ్ ఒప్పుకుంటాడేమో చూడాలి. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా క్యూట్ బేబీ రష్మిక మందన్న నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.