బతికి ఉండగానే హీరోయిన్ ను చంపేశారు !

బతికి ఉండగానే చంపేయడం మీడియాకి కొత్తేం కాదు. కొన్నిసార్లు మీడియా ప్రదర్శించే అతికి అత్యుత్సాహానికి కొందరు సెలెబ్రిటీలు బలి అవుతుంటారు. బతికి ఉండగానే.. వారు తమ చావు వార్తలను చదువుకునే దుస్థితి వారికి ఒక్కోసారి ఈ మీడియా వల్ల కలుగుతోంది. దాంతో వాళ్ళు మళ్ళీ జనం ముందకు వచ్చి మేం బతికే ఉన్నాం మహాప్రభో అని చెప్పుకోవాల్సి రావడం అంటే.. నిజంగా అది పెద్ద తలనొప్పే. ఇలాంటి వార్తలు రావడానికి ముఖ్య కారణం పేర్లు కొంచెం మ్యాచ్ […]

Written By: admin, Updated On : October 4, 2020 6:37 pm
Follow us on


బతికి ఉండగానే చంపేయడం మీడియాకి కొత్తేం కాదు. కొన్నిసార్లు మీడియా ప్రదర్శించే అతికి అత్యుత్సాహానికి కొందరు సెలెబ్రిటీలు బలి అవుతుంటారు. బతికి ఉండగానే.. వారు తమ చావు వార్తలను చదువుకునే దుస్థితి వారికి ఒక్కోసారి ఈ మీడియా వల్ల కలుగుతోంది. దాంతో వాళ్ళు మళ్ళీ జనం ముందకు వచ్చి మేం బతికే ఉన్నాం మహాప్రభో అని చెప్పుకోవాల్సి రావడం అంటే.. నిజంగా అది పెద్ద తలనొప్పే. ఇలాంటి వార్తలు రావడానికి ముఖ్య కారణం పేర్లు కొంచెం మ్యాచ్ అవ్వడమే. కాస్త ఒకే రకంగా ఉన్న పేర్లు అయితే చాలు.. పూర్తి వివరాలు తెలుసుకోక ముందే కథనాలు వండి వారుస్తుంటారు మన రాతల రాయుళ్ళు.

Also Read: బాలయ్య కోసం వారణాసి ప్రయాణం !

ఈ క్రమంలో మిస్త్రీ చక్రవర్తి అనే హీరోయిన్‌ ను జాతీయ మీడియా చంపేసింది. ఇంతకీ మిస్త్రీ చక్రవర్తి ఎవరు అనుకుంటున్నారా.. చిన్నదాన నీకోసం అనే తెలుగు సినిమాలోనూ హీరోయిన్ గా నటించి పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన హీరోయిన్. అయితే ఈమె తాజాగా చనిపోయిందని వార్తలు వచ్చాయి. నిజానిజాలు తెలుసుకోకుండానే కిడ్నీ ఫెయిల్ అయి మిస్త్రీ చక్రవర్తి చనిపోయిందనే వార్త ఈ రోజు ఒక దావానంలా వ్యాప్తి చెందింది. ఈ హీరోయిన్ బతికి ఉండగానే చనిపోయిందని చివరకు వికీపీడియాలోనూ చనిపోయినట్టు డేట్‌ను ఎడిట్ చేశారంటే ఏమనుకోవాలి.

Also Read: కరాటేకు పూర్వ వైభవం రావాలి: హీరో విశ్వక్ సేన్

అందుకే సదరు హీరోయిన్ మీడియా పై సీరియస్ అవుతూనే సెటైర్లు వేసింది. కొన్ని మీడియా సంస్థల కథనాల ప్రకారం తాను ఈ రోజు చనిపోయాను. కాకపోతే దేవుడి దయ వల్ల నేను పూర్తి ఆరోగ్యంతో బాగానే ఉన్నాను. నేను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది అంటూ తన పై వచ్చిన ఈ వార్త ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. అసలు ఇంతకీ ఏం జరిగిందేంటంటే.. మిస్త్రీ బెనర్జీ అనే ఓ బెంగాలీ నటి కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయింది ఈ రోజు. ఆ విషయాన్ని తెలుసుకోకుండానే మిస్త్రీ అనే పేరు మ్యాచ్ అయింది కాబట్టి మిస్త్రీ చక్రవర్తిని మొత్తానికి జాతీయ మీడియా చంపేసింది. నిజంగా ఇలాంటి దౌర్భాగ్యం ఎవ్వరికీ రాకూడదు.