Vishvambhara : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వంభర'(Viswambhara Movie). అప్పట్లో ఈ సినిమాని ప్రకటించినప్పుడు అభిమానుల్లోనే కాదు, సాధారణ ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగా పెరిగాయి. ఎందుకంటే చాలా కాలం తర్వాత చిరంజీవి చేస్తున్న గ్రాఫిక్స్ చిత్రం, అందులోనూ వరుస రీమేక్ సినిమాల తర్వాత వస్తున్న స్ట్రెయిట్ తెలుగు చిత్రం, చిరంజీవి ఇంటి దైవం అయినటువంటి ఆంజనేయ స్వామి బ్యాక్ డ్రాప్ లో వస్తుంది కాబట్టి కచ్చితంగా ఈ చిత్రం కుంభస్థలం బద్దలు కొడుతుందని అంతా అనుకున్నారు. కానీ టీజర్ తర్వాత అంచనాలు మొత్తం ఆవిరి అయిపోయాయి. కథ ఆసక్తి రేపినప్పటికీ గ్రాఫిక్స్ చూసేందుకు చాలా నాశిరకంగా ఉండడంతో విపరీతమైన ట్రోలింగ్ కి గురైంది ఈ చిత్రం. సోషల్ మీడియా లో వచ్చిన ట్రోల్స్ ని పరిగణలోకి తీసుకొని చిరంజీవి VFX టీం మొత్తాన్ని మార్పించాడు.
Also Read : ‘విశ్వంభర’ అసలు రిలీజ్ అవుతుందా లేదా..? అసలు ఏమి జరుగుతుంది!
‘కల్కి’ చిత్ర దర్శకుడు నాగ అశ్విన్(Nag Ashwin) పర్యవేక్షణలో గ్రాఫిక్స్ ని చేయిస్తున్నారు. రీసెంట్ గానే ఫైనల్ కట్స్ కొన్ని చిరంజీవి కి చూపించారట. ఆ కట్స్ పై మెగాస్టార్ సంతృప్తి చెందినట్టు తెలుస్తుంది. గ్రాఫిక్స్ సెట్ అయ్యే వరకు విడుదల తేదీని ప్రకటించొద్దు అంటూ నిర్మాతలకు చాలా గట్టిగా చెప్పాడు మెగాస్టార్. ఆయన చెప్పినట్టుగానే క్వాలిటీ VFX సెట్ అవ్వడం తో ఇప్పుడు విడుదల తేదీని కూడా లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఏడాది జులై 24 న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇకపోతే ఈ నెల 12 వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోయే రెండు మూడు రోజుల్లో చేయబోతున్నారు మేకర్స్. నందిగామలో హనుమాన్ విగ్రహం వద్ద ఈ సాంగ్ ని లంచ్ చేయబోతున్నారట.
షూటింగ్ కార్యక్రమాలు మొత్తం దాదాపుగా పూర్తి అయినట్టే. ఓటీటీ డీల్ కూడా ఈ నెలలోనే క్లోజ్ చేయబోతున్నారట. నెట్ ఫ్లిక్స్ సంస్థ కు అమ్ముదామని చూసారు కానీ, ఈ ఏడాదికి సంబంధించిన స్లాట్స్ వాళ్లకు అయిపోయాయి. కొత్త స్లాట్ లో చేసుకోవాలంటే వచ్చే ఏడాదే చేయాలి, అందుకే నెట్ ఫ్లిక్స్ సంస్థ తో డీల్ ఉపసంహరించుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలివ్ వంటి ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన సతీమణి తో కలిసి సింగపూర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ని చూసేందుకు వెళ్ళాడు. అక్కడి నుండి తిరిగి వచ్చిన వెంటనే సాంగ్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నాడు. టీజర్ ని చూసి అభిమానులు బాధపడకండి, సినిమా చాలా అద్భుతంగా వచ్చింది అంటూ మెగాస్టార్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో విడుదల చేయబోయే ప్రమోషనల్ కంటెంట్ ఈ చిత్రంపై అంచనాలను ఎలా పెంచబోతుంది అనేది.
Also Read : రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన ‘విశ్వంభర’ హిందీ థియేట్రికల్ రైట్స్..’గేమ్ చేంజర్’, ‘దేవర’ కంటే ఎక్కువ!