Vishvambhara : రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం ‘విశ్వంభర'(Viswambhara Movie). ఆరంభంలో ఈ సినిమాపై క్రేజ్ మామూలు రేంజ్ లో ఉండేది కాదు, కచ్చితంగా ఈ చిత్రంతో మెగాస్టార్ పాన్ ఇండియా లెవెల్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అనుకున్నారు. కానీ గత ఏడాది ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల అయ్యి ఏ రేంజ్ ట్రోల్స్ కి గురి కాబడిందో మనమంతా చూసాము. సినిమా కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ, గ్రాఫిక్స్ మాత్రం అత్యంత దారుణంగా ఉన్నాయని, భారీ బడ్జెట్ సినిమా అంటూ జనాలను మోసం చేస్తున్నారని, అమీర్ పేట్ గ్రాఫిక్స్ ఇంతకంటే బాగుంటాయి అంటూ ఎన్నో మాటలు అన్నారు. ఈ ట్రోల్స్ మొత్తాన్ని బాగా గమనించిన మూవీ టీం, VFX పై రీ వర్క్ చేయాలనీ నిర్ణయించుకుంది.
Also Read : రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన ‘విశ్వంభర’ హిందీ థియేట్రికల్ రైట్స్..’గేమ్ చేంజర్’, ‘దేవర’ కంటే ఎక్కువ!
మెగాస్టార్ చిరంజీవి తన పలుకుబడి మొత్తాన్ని ఉపయోగించి, పెద్ద పెద్ద VFX కంపెనీలకు షిఫ్ట్ చేయించి పని చేయించాడు. రీసెంట్ గానే ఆయన రీ వర్క్ కి సంబంధించిన కొన్ని షాట్స్ ని చూశాడట. ఆ షాట్స్ చిరంజీవి కి ఏమాత్రం నచ్చలేదని, ఎక్కడో ఎదో మిస్ అవుతుంది అంటూ తన టీం ముందు అసహనం వ్యక్తం చేసాడట. చిరంజీవి రీసెంట్ గా తయారు చేయించిన VFX షాట్స్ కి ఓకే చెప్తే, సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాలనే ప్లాన్ లో ఉన్నారట. కానీ చిరంజీవి నుండి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో ఈ సినిమా గురించి అప్డేట్ బయటకు రాలేదని అంటున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని మే లో విడుదల చేయాలని అనుకున్నారు, కానీ ఇప్పుడు సెప్టెంబర్ నెలలో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట. అప్పటికి కూడా పని కాకపోతే ఈ ఏడాది అసలు ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా ఉండడమే మంచిది అనే భావన లో ఉన్నారట.
ఎందుకంటే డిజిటల్ రైట్స్ ని భారీ రేట్ కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఒక సినిమా విడుదల అయ్యేది డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయినప్పుడే. విశ్వంభర నిర్మాతలు ఆశించిన రేట్ కి కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడం తో, ఆయన తక్కువ రేట్ కి అమ్మెందుకు సిద్ధంగా లేదు. పైగా బోలెడంత VFX వర్క్ పెండింగ్ లో ఉంది. అందుకే విశ్వంభర చిత్రం కంటే ముందుగా అనిల్ రావిపూడి తో చేయబోతున్న చిత్రాన్ని ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు #Mega157 ట్యాగ్ ని విశ్వంభర కి ఉపయోగించేవారు, కానీ ఇప్పుడు ఆ ట్యాగ్ ని చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాకు ఉపయోగిస్తున్నారు. అంటే ఈ చిత్రమే ముందుగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న రూమర్స్.
Also Read : విశ్వంభర’ చిత్రం షూటింగ్ ఆగిపోయిందా..? నిర్మాతలపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర అసహనం..అసలు ఏమి జరుగుతుంది!