Renu Desai : చాలా కాలం నుండి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కుమారుడు అకిరా నందన్(Akira Nandan) మరో రెండేళ్లలో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నాడని, రామ్ చరణ్(Global Star Ram Charan) ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని, ప్రస్తుతం నటన విషయం లో శిక్షణ తీసుకుంటున్నాడని, మీడియా లో వార్తలు వినిపించిన సంగతి మన అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ కూడా ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో లో త్వరలోనే అకిరా నందన్ ఎంట్రీ ఉంటుందని చెప్పుకొచ్చాడు. నిన్న అకిరా నందన్ పుట్టిన రోజు. అతని తల్లి రేణు దేశాయ్(Renu Desai) ఒక ప్రముఖ ఛానల్ పోడ్ క్యాస్ట్ లో పాల్గొని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడిన ఈ మాటలు అభిమానుల ఆశలపై నీళ్లు జల్లినట్టు అయ్యింది. అకిరా త్వరలో ఇండస్ట్రీ లోకి వస్తాడని ఆయనపై పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా పవర్ ఫుల్ ఎడిటింగ్ వీడియోస్ కూడా చేసి పెట్టారు.
Also Read : భూవివాదంపై రేణు దేశాయ్ ఆవేదన..సంచలనం రేపుతున్న వాట్సాప్ చాట్!
అవి సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో మనమంతా చూసాము. కొన్ని థియేటర్స్ లో కూడా ఈ వీడియోస్ ని ప్లే చేసారు. అంతలా వైరల్ అయ్యింది. కానీ చివరికి రేణు దేశాయ్ ఇలాంటి మాటలు మాట్లాడడం ఇప్పుడు అభిమానులకు మింగుడు పడని పరిస్థితి. యాంకర్ రేణు దేశాయ్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘అకిరా నందన్ త్వరలోనే సినిమాల్లోకి రాబోతున్నాడట?, పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం లో అతిథి పాత్ర చేస్తున్నాడట?, రామ్ చరణ్ మొదటి సినిమా ని నిర్మించబోతున్నాడట? ఇవన్నీ నిజాలేనా?’ అని అడిగితే, దానికి ఆమె సమాదానాలు చెప్తూ ‘అవన్నీ అబద్దాలే. రామ్ చరణ్ అకిరా నందన్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేయబోతున్నాడు అనేది పూర్తిగా అవాస్తవం. నేను రామ్ చరణ్ తో నిత్యం టచ్ లోనే ఉంటాను, అతన్ని కూడా నేను వార్త గురించి అడిగాను, నవ్వుకున్నాడు’.
‘అకిరా కి కూడా ఆ వార్త ని షేర్ చేస్తే ఇదే తరహా రియాక్షన్ వచ్చింది. అసలు అకిరా నందన్ ఇప్పటికీ సినీ ఇండస్ట్రీ లోకి రావాలా, వద్దా అనేది నిర్ణయం తీసుకోలేదు. ఎవరికి ఇష్టమొచ్చింది వాళ్ళు రాసుకున్నారు. ఒకవేళ అకిరా నందన్ సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యమే ఉంటే, నేనే నా ఇన్ స్టాగ్రామ్ ద్వారా అధికారిక ప్రకటన చేస్తాను. అప్పటి వరకు సైలెంట్ గా ఉండండి’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. కానీ అకిరా నందన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోచింగ్ తీసుకుంటున్న విషయం వాస్తవం. కేవలం ఒక్క నటనలోనే కాదు డైరెక్షన్ , డ్యాన్స్ వంటివి కూడా నేర్చుకుంటున్నాడు. మరి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తాడు?, రామ్ చరణ్ సైతం ఎందుకు త్వరలోనే ఎంట్రీ ఉంటుంది అని చెప్తాడు?, రేణు దేశాయ్ సర్ప్రైజ్ ప్లానింగ్ కోసం ఇలా మాట్లాడుతుందా అనే సందేహాలు అభిమానుల నుండి వ్యక్తం అవుతున్నాయి.
Also Read : ఇలాంటి దుర్మార్గులకు దూరంగా ఉండాలి..కఠినంగా శిక్షించాలి అంటూ రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్!
#AkiraNandan in OG is false news, and #RamCharan isn't grooming Akira, says Renu Desai. | #PawanKalyan pic.twitter.com/blIfzmROU9
— Movies4u Official (@Movies4u_Officl) April 8, 2025