Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: ప్రేరణపై అసూయతో రగిలిపోతున్న విష్ణుప్రియ..ఈమె బిగ్ బాస్ కి వచ్చింది...

Bigg Boss Telugu 8: ప్రేరణపై అసూయతో రగిలిపోతున్న విష్ణుప్రియ..ఈమె బిగ్ బాస్ కి వచ్చింది పృథ్వీ కోసమా? లేదా ఆట కోసమా?

డబల్ ఎలిమినేషన్ ద్వారా వీళ్ళిద్దరిని బయటకి తోసేస్తే ప్రశాంతంగా ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇదంతా పక్కన పెడితే నిన్న ఈమె నామినేషన్స్ ప్రక్రియ ని ఎంత తేలికగా, వెటకారంగా తీసుకుందంటే, బిగ్ బాస్ ని ఇష్టం గా చూసేవాళ్లకు టీవీ ని నేలకేసి పగలకొట్టాలి అనే రేంజ్ లో కోపం తెప్పించింది అని చెప్పొచ్చు.

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రతీ కంటెస్టెంట్ లో గెలవాలి అనే తపన, కసి ఉంది. కానీ విష్ణుప్రియ లో మాత్రం అసలు ఆడాలనే కసి లేదు. ఎంతసేపు పృథ్వీ వెనుక తిరగడమే ఈమె చేసే పని. మొన్నటి ఆదివారం ఎపిసోడ్ లో ఈమె నామినేషన్స్ లో ఉన్నప్పుడు కూడా అంత భయపడలేదు కానీ, పృథ్వీ నామినేషన్స్ లో ఉన్నప్పుడు భయపడి దేవుడికి మొక్కుకుంటూ ఉండడాన్ని మనమంతా గమనించే ఉంటాం. గంగవ్వ ఈమె ఓవర్ యాక్షన్ భరించలేక తిడుతుంది కూడా. ఇలా విష్ణు ప్రియ కి రోజు రోజుకు పృథ్వీ మీద పిచ్చి పెరిగిపోయి, అసలు ఆమె బిగ్ బాస్ హౌస్ కి వచ్చిందే పృథ్వీ కోసం అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. ఇది ఆమె అభిమానులకు కూడా అసలు ఏమాత్రం నచ్చడం లేదు. ఈ వారం నామినేషన్స్ లోకి విష్ణు ప్రియ తో పాటుగా, పృథ్వీ కూడా వచ్చాడు.

డబల్ ఎలిమినేషన్ ద్వారా వీళ్ళిద్దరిని బయటకి తోసేస్తే ప్రశాంతంగా ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇదంతా పక్కన పెడితే నిన్న ఈమె నామినేషన్స్ ప్రక్రియ ని ఎంత తేలికగా, వెటకారంగా తీసుకుందంటే, బిగ్ బాస్ ని ఇష్టం గా చూసేవాళ్లకు టీవీ ని నేలకేసి పగలకొట్టాలి అనే రేంజ్ లో కోపం తెప్పించింది అని చెప్పొచ్చు. ప్రేరణ ని కేవలం పృథ్వీ కోసం నామినేట్ చేయడానికి వచ్చింది. ‘నువ్వు కిల్లర్ గర్ల్ గా ఉన్నప్పుడు ఎందుకో సరైన నిర్ణయం తీసుకోలేదని నాకు అనిపించింది, నాగార్జున గారు కూడా మీదే తప్పుబట్టారు. అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది. దీనికి ప్రేరణ సమాధానం ఇస్తూ ‘నిఖిల్, గంగవ్వ చెప్పిన పాయింట్స్ నామినేట్ చేసే రేంజ్ కి కాదు. వాళ్ళిద్దరితో నాకు ఎవరిది బెస్ట్ అనిపిస్తే వాళ్ళది తీసుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయం లో ఎలాంటి తప్పు లేదని ఇప్పటికీ భావిస్తాను’ అని చెప్పుకొచ్చాడు. అలాగే ఫుడ్ విషయం లో నువ్వు చాలా కఠినంగా ఉంటావని, అలా ఉండడం కరెక్ట్ కాదని, పరిమితులు ఫుడ్ మీద పెట్టొద్దు అంటూ చెప్పుకొచ్చింది.

దీనికి ప్రేరణ సమాధానం చెప్తూ ‘ఇక్కడ మన తల్లి, తండ్రి, అన్నయ్య ఎవ్వరూ లేరు, అందరూ సమానమే. ఫుడ్ అందరికీ సరిసమానంగా అందాలి అనే నా ప్రయత్నం. ఒకరు తక్కువగా ఒక ఎక్కువగా ఎందుకు తినాలి?, అందరికీ టాస్కులు ఆడేందుకు శక్తి రావాలి కాబట్టి అందరూ సరిసమానంగా ఫుడ్ తినాలి అనే లక్ష్యంతోనే నేను పని చేశాను, అందులో తప్పేమి ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. వాస్తవానికి విష్ణు ప్రియ కి ప్రేరణ ని నామినేట్ చేసేందుకు బలమైన కారణం ఏది దొరకలేదు. కేవలం ఆమెని పృథ్వీ కోసమే నామినేట్ చేసింది అనేది చూసే ఆడియన్స్ అందరికీ అర్థం అయ్యింది. అంతే కాదు విష్ణు ప్రియ మొదటి నుండి ప్రేరణ మీద అసూయతో రగిలిపోతుందనే విషయాన్ని నెటిజెన్స్ మరోసారి గుర్తు చేసారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper