Viral Photo : ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిన్నారులలో డాడీ సినిమా చిన్నారి కూడా ఒకటి. ఈ చిన్నారి టాలీవుడ్ లో డాడీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే తన అమాయకమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. డాడీ సినిమా తర్వాత ఈ చిన్నారి మరి ఏ సినిమాలోను కనిపించలేదు. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.
Also Read : ప్రశాంత్ వర్మ కావాలనే స్టార్ హీరోలకు స్టోరీ చెబుతున్నాడా..?
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాలలో డాడీ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాడీ సినిమాకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికీ కూడా డాడీ సినిమా టీవీలో ప్రసారమైతే చాలామంది ఎంతో ఇష్టంగా చూస్తారు. 2001లో ప్రేక్షకుల మందికి వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో చిరంజీవి కూతురుగా నటించిన చిన్నారి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఈ సినిమాలో చిన్నారి తన నటనతో ప్రేక్షకుల మనసును కొల్లగొట్టింది. ఈ చిన్నారి పేరు అనుష్క మల్హోత్రా. ఈ సినిమాలో చిరంజీవి కూతురుగా అక్షయ పాత్రలో అనుష్క మల్హోత్రా చాలా బాగా నటించింది. తన అమాయకపు చూపులతో, చక్కటి నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అనుష్క మల్హోత్రా ముంబైకి చెందిన అమ్మాయి. టాలీవుడ్ లో ఈమె తన తండ్రికి తెలిసిన వాళ్ళు ద్వారా డాడీ సినిమాలో చిరంజీవి కూతురుగా నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమాలో అనుష్క నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. డాడీ సినిమా తర్వాత అనుష్క మల్హోత్రా బాలీవుడ్లో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే తన దృష్టి మొత్తాన్ని చదువులపై పెట్టి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. తాజాగా డాడీ సినిమాలో నటించిన చిన్నారి ప్రస్తుతం ఎలా ఉంది అంటూ నెటిజెన్స్ గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అనుష్క చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.అనుష్క మల్హోత్ర లండన్ లో ఓనర్స్ లో డిగ్రీ పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతమేమే తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తుంది. అనుష్క సామాజిక మాధ్యమాల్లో తన ఫోటోలు మరియు ఫ్యామిలీతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
View this post on Instagram