Odela 2 Trailer : ప్రముఖ హీరోయిన్ తమన్నా(Tamannaah Bhatia) చాలా కాలం తర్వాత ‘ఓదెల 2′(Odela 2) అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం తో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో ఆహా మీడియా యాప్ లో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. సంపత్ నంది(Sampath Nandi) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 17 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. విడుదలకు ముందే ప్రీ రిలీజ్ నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే బడ్జెట్ ని రీ కవర్ చేసిన ఈ చిత్రం, థియేట్రికల్ బిజినెస్ ని కూడా భారీగానే జరుపుకుంది. హారర్ నేపథ్యం లో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.ఇకపోతే నేడు ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ టీం.
Also Read : అక్కినేని అఖిల్ ‘లెనిన్’ టీజర్ వచ్చేసింది..ఈసారి మిస్ అయ్యేలా లేదు!
ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఈ రేంజ్ లో ఉంటుందని అసలు ఊహించలేదని, మంచి హారర్ కంటెంట్ తో సర్ప్రైజ్ చేసారని అంటున్నారు. కథ విషయానికి వస్తే ఊర్లో ఎన్నో దుర్మార్గాలు చేసిన ఒక దుష్టుడు, చనిపోయిన తర్వాత ప్రేతాత్మగా మారి ఊర్లో జనాలను పట్టి పీడిస్తూ ఉంటాడు. ఆ ప్రేతాత్మ నుండి ఊర్లో జనాలను కాపాడే క్యారక్టర్ లో తమన్నా ఇందులో కనిపించనుంది. ఆమె క్యారక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని ట్రైలర్ ని చూస్తేనే అర్థం అవుతుంది. ఈ ట్రైలర్ లో ఆమె చేసిన ఫైట్స్ కూడా చేయడం గమనార్హం. అయితే మహాశివుడి పై విలన్ వేసే డైలాగ్స్ రాబోయే రోజుల్లో వివాదాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. సినిమాలో గ్రాఫిక్స్, సబ్జెక్టు కూడా చాలా బలంగానే ఉండేలా అనిపిస్తున్నాయి. హారర్ ఎలిమెంట్స్ వర్కౌట్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం మరో అరుంధతి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన డైరెక్టర్ సంపత్ నంది ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాతో అందరినీ షాక్ కి గురి చేశాడు. సంపత్ నంది లో ఇంత టాలెంట్ ఉందా అని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఓదెల 2 చిత్రంతో అలాంటి ఫీలింగ్ నే మరోసారి రప్పించాడు. ఇకపోతే తమన్నా కి ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడం అత్యవసరం. చాలా కాలం తర్వాత ఆమె చేసిన డైరెక్ట్ తెలుగు సినిమా ఇది. ఈ సినిమా హిట్ అయితే భవిష్యత్తులో ఆమె మరికొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే అవకాశాలు ఉంటాయి. ఈమధ్య కాలం లో తెలుగు లో తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ వచ్చిన తమన్నా, ఈ చిత్రానికి మాత్రం వేరే డబ్బింగ్ ఆర్టిస్టు ని అశ్రయించినట్టు ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతుంది. విడుదలకు ముందే మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ చిత్రం విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read : ఈ అందాన్ని చూస్తే మతి పోవాల్సిందే…