Prashanth Varma and Prabhas : ఇప్పటి వరకు చాలా మంది నటులు భారీ గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…ఇక స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి దర్శకులు మంచి కథల కోసం అనుక్షణం పరితపిస్తున్నారు…యంగ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ సైతం హనుమాన్ సినిమా మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఇక మీదట కూడా భారీ విజయాలను అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆయన చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికి ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఈ సినిమాతో ఒక గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ప్రణాళికలైతే రూపొందించుకుంటున్నాడు. ఇప్పటికే బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ (Mokshagna) తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆయన ప్రొడ్యూసర్ గా కూడా మారడానికి ప్రయత్నాలైతే చేస్తున్నాడు. దాంతో పాటుగా ఇతరుల దర్శకులకు కథలను అందించడానికి కూడా సన్నాహాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తెచ్చి పెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ప్రభాస్ కి కథను వినిపించిన ఆయన ఎన్టీఆర్ కి కూడా ఒక కథను అయితే చెప్పారట. మరి వీళ్ళిద్దరూ కూడా ఆ కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
Also Read : మోక్షజ్ఞ సినిమా మరింత లేట్ కానుందా..? అసలు ఎందుకిలా జరుగుతుంది…
ఇక ఇదంతా చూస్తున్న ట్రేడ్ పండితులు మాత్రం ఆయన ఇప్పటి వరకు పాన్ ఇండియాలో సాధించింది ఒక్కటే విజయం…ఇక ఆ సక్సెస్ ను ఆసరా గా చేసుకొని స్టార్ హీరోలకి కథలను చెప్పి ఒప్పించడం అన్ని సినిమాలు ప్రాజెక్టులు ఓకే అవుతున్నాయి అంటూ ప్రేక్షకులను నమ్మించడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు.
అతను చేయాలనుకున్న జై హనుమాన్(Jai Hanuman) సినిమాని అలాగే మోక్షజ్ఞ (Mokshagna) సినిమాని సక్సెస్ ఫుల్ గా చేసి ఆ తర్వాత స్టార్ హీరోల దగ్గరికి వెళ్తే బాగుంటుంది అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక ఇదంతా చూస్తున్న కొంతమంది సినిమా మేధావులు మాత్రం ప్రశాంత్ వర్మ తన మీద అటెన్షన్ క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే ఇలాంటి కొన్ని ట్రిక్స్ ని వాడుతున్నాడని, తను కమిట్ అయిన సినిమాలను చేయకుండా ఇతర హీరోలకు కథలను చెప్పి వారిని ఒప్పించినట్టుగా ఒక నమ్మకాన్ని అయితే ప్రేక్షకుల్లో క్రియేట్ చేస్తున్నాడు. వీటి ద్వారా ఆయన మార్కెట్ భారీగా పెరుగుతుందని అందరిని నమ్మిస్తూ భారీ హైప్ ను క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…
Also Read : ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్న దిల్ రాజు…కారణం ఏంటంటే..?