CM Vijay: తమిళ హీరో విజయ్ సీఎం అయ్యాక సోషల్ మీడియా లో ఆయనపై పాజిటివ్ కథనాలు ఏ రేంజ్ లో ప్రచారం అవుతున్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. అయితే పైకి కనిపించేది మొత్తం రంగుల ప్రపంచమని, కానీ రియాలిటీ లో విజయ్ పాలనలో ఆశించిన స్థాయి మార్క్ కనిపించడం లేదని , DMK ప్రభుత్వం లో సీఎం స్టాలిన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను విజయ్ కొనసాగించడంలో విఫలం అవుతున్నారని , ఇలా ఆయన ప్రత్యర్థులు కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ కి అతి పెద్ద పీఆర్ టీం ఉందని, ఆ పీఆర్ స్తంట్స్ ని సోషల్ మీడియా లో బాగా వైరల్ చేసి , యువత ని తప్పుదోవ పట్టించి ఆయన ముఖ్య మంత్రి అయ్యారని అందరూ అంటుంటారు. ప్రత్యర్థులు అన్నాక ఇలా కాకుండా , ఇంకెలాంటి కామెంట్స్ చేస్తారు? అని చాలా మంది అనుకున్నారు.
కానీ నేడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో ఒక కార్మికురాలు విజయ్ తో కలిసి ఫోటో దిగి , ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అందుకు విజయ్ సైలెంట్ గా ఆమె వైపు చూస్తూ ఉండిపోయారు కానీ , షేక్ హ్యాండ్ ఇవ్వడానికి మాత్రం ఆసక్తి చూపించలేదు. అనంతరం సెక్యూరిటీ ఆమెని పక్కకి తీసుకెళ్లారు. ఈ వీడియో పై సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రోల్స్ నడుస్తున్నాయి. దీనితో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వీడియో ని పోల్చి చూస్తూ , కార్మికుల పట్ల నిజమైన ఆప్యాయత ఉంటే ఇలా వ్యవహరించాలి అంటూ గతంలో పవన్ కళ్యాణ్ కార్మికులపై చెయ్యి వేసుకొని ఆప్యాతగా వాళ్ళని గౌరవించిన వీడియో ని షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.
విజయ్ ప్రస్తుతానికి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి , పవన్ కళ్యాణ్ కేవలం ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి అవ్వొచ్చు. కానీ పవన్ తన శాఖలను దేశం లోనే అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్తున్నారు , కానీ విజయ్ మాత్రం కేవలం పీఆర్ స్తంట్స్ కి మాత్రమే పరిమితమయ్యారని, తమిళనాడు ప్రజలు ఆయనపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోతున్నారని అంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఇలా నిత్యం ఈ ఇరువురి నాయకుల అభిమానుల మధ్య సోషల్ మీడియా లో ఫ్యాన్ వార్స్ నడుస్తూనే ఉంటాయి. మరి రాబోయే రోజుల్లో పాలనలో ఎవరిదీ పై చెయ్యి గా నిలుస్తుంది , ఎవరు జనాల్లో నెగెటివ్ అవ్వబోతున్నారు అనేది చూడాలి.
That’s the difference. pic.twitter.com/USnaubkmBL
— Bhaskar (@BhachoJSP) July 14, 2026
