https://oktelugu.com/

Vijay Deverakonda : బెట్టింగ్ యాప్ కేసు పై స్పందించిన విజయ్ దేవరకొండ..ట్వీట్ వైరల్!

Vijay Deverakonda : గత కొద్దిరోజుల నుండి బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్స్ చేసిన సెలబ్రిటీల పై పోలీసులు కేసులు నమోదు చేస్తున్న ఘటన సంచలనంగా మారింది.

Written By: , Updated On : March 20, 2025 / 04:52 PM IST
Vijay Deverakonda

Vijay Deverakonda

Follow us on

Vijay Deverakonda : గత కొద్దిరోజుల నుండి బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్స్ చేసిన సెలబ్రిటీల పై పోలీసులు కేసులు నమోదు చేస్తున్న ఘటన సంచలనంగా మారింది. ఏకంగా 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు కాగా ఈరోజు విష్ణు ప్రియ, టేస్టీ తేజ వంటి వారు పోలీసుల విచారణకు హాజరయ్యారు. అదే విధంగా వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామలపై కి కూడా రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. అయితే కేసులే నమోదైన 25 మంది సెలబ్రిటీలతో యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పేరు కూడా ఉండడం గమనార్హం. ఆయనతో పాటు రానా దగ్గుబాటి(Rana Daggubati), ప్రకాష్ రాజ్(Prakash Raj), మంచు లక్ష్మి(Manchu Lakshmi) వంటి వారు కూడా ఉన్నారు. అయితే తనపై నమోదైన కేసు గురించి విజయ్ దేవరకొండ టీం కాసేపటి క్రితమే మీడియా కి ఒక లేఖను విడుదల చేసింది.

Also Read : విజయ్ దేవరకొండ బైక్ ఎక్కిన నాని… వివాదాలకు ఇలా చెక్ పెట్టారా?

ఆ లేఖలో ఏముందంటే ‘విజయ్ దేవరకొండ కేవలం స్కిల్స్ ఆధారిత గేమ్స్ ని ప్రమోట్ చేసే ప్రక్రియ లో ఒక ప్రముఖ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు అనేది మేము ప్రజలకు తెలియచేస్తున్నాను. చట్టబద్ధంగా ఆన్లైన్ గేమ్స్ కి అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ ఆమోదం తెలిపాడు. విజయ్ దేవరకొండ ఏ ప్రముఖ కంపెనీ కి అయినా బ్రాండ్ అంబాసిడర్ గా పని చేయడానికి ముందు, ఆయన టీం లీగల్ గా పనిచేస్తున్నారా లేదా అనేది పరిశీలించిన తర్వాతే ఒప్పందం చేసుకుంటాడు. అంతే కాకుండా ఆయన ప్రమోట్ చేసే ప్రోడక్ట్ కి చట్టపరమైన అనుమతి ఉందా లేదా అనేది కూడా చూసుకుంటాడు. అలాంటి అనుమతులు ఉన్నటువంటి A23 అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ పని చేశాడు. ఆ డీల్ 2023 వ సంవత్సరం తోనే ముగిసింది. ఇప్పుడు ఆయనకు, ఆ కంపెనీ కు ఎలాంటి సంబంధం లేదు’

‘అనధికారికంగా ఉన్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ని ఆయన ఎప్పుడూ ప్రోత్సహించలేదు. సోషల్ మీడియా లో వస్తున్నా అపోహలు, తప్పుడు సమాచారాల్లో ఎలాంటి నిజం లేదని ఈ లేఖ ద్వారా తెలియచేస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో ‘కింగ్డమ్’ అనే చిత్రం చేస్తున్నాడు. లైగర్, ఫ్యామిలీ స్టార్ వంటి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత వస్తున్న చిత్రమిది. ఇటీవలే విడుదలైన టీజర్ కి కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మే 31న విడుదల కాబోతున్న ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వస్తాడా లేదా అనేది చూడాలి.

Also Read : హే ఏంటి ఇంత ఛేంజ్.. మెడలో రుద్రాక్ష, కాషాయ వస్త్రాలు.. మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ