Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda : విజయ్ దేవరకొండ బైక్ ఎక్కిన నాని... వివాదాలకు ఇలా చెక్ పెట్టారా?

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ బైక్ ఎక్కిన నాని… వివాదాలకు ఇలా చెక్ పెట్టారా?

Vijay Deverakonda : అష్టాచెమ్మా చిత్రంతో హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు నాని. భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది వంటి చిత్రాలు బ్రేక్ ఇచ్చాయి. హీరోగా నిలదొక్కుకున్నాడు. టైర్ టు హీరోల్లో నాని టాప్ పొజీషన్ లో ఉన్నాడని చెప్పొచ్చు. అదే సమయంలో విజయ్ దేవరకొండ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ హీరోగా ఎదిగాడు. నువ్విలా విజయ్ దేవరకొండ డెబ్యూ మూవీ. పెళ్లి చూపులు చిత్రంలో మొదటిసారి హీరో ఛాన్స్ వచ్చింది. తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామా సూపర్ హిట్.

Also Read : విజయ్ దేవరకొండ హీరో కాకముందు ఎన్ని పాట్లు పడ్డాడో తెలుసా..? ఆడిషన్ వీడియో వైరల్

అనంతరం దర్శకుడు సందీప్ రెడ్డి తెరకెక్కించిన అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ ఫేట్ మారిపోయింది. ఆయన ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. టైర్ టు హీరోల రేసులో నాని-విజయ్ దేవరకొండ మధ్య గట్టి పోటీ నెలకొంది. కాగా కెరీర్ బిగినింగ్ లో వీరిద్దరూ కలిసి నటించారు. స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కల్కి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ మూవీలో నాని, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతూ వర్మ ప్రధాన పాత్రలు చేశారు.

నాని హీరో కాగా… అతడి మిత్రుడిగా కీలకమైన రోల్ లో విజయ్ దేవరకొండ కనిపించాడు. విజయ్ దేవరకొండ పాత్ర కీలకంగా ఉంటుంది. స్క్రీన్ స్పేస్ ఉన్న రోల్. ఈ మూవీ విజయ్ దేవరకొండకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆయన నటన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ విడుదలై 10 ఏళ్ళు అవుతుంది. 2015లో ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చింది. ఎవడే సుబ్రహ్మణ్యం విడుదలై పదేళ్లు అవుతున్న నేపథ్యంలో టీమ్ కలిశారు. ఈ సందర్భంగా ఆ చిత్రంలో ఒక సన్నివేశాన్ని ఇమిటేట్ చేస్తూ.. విజయ్, నాని, మాళవిక బైక్ ఎక్కి పోజిచ్చారు. ఈ ఫోటో వైరల్ అవుతుంది.

లైఫ్ అంటే ఏమిటీ? సక్సెస్ వెనుక పరిగెత్తడమా? లేక ఇష్టం వచ్చినట్లు జీవించడమా? అనే పాయింట్ ఆధారంగా ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ తెరకెక్కించారు. ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మించారు. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా… రూ. 18 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

Also Read : నాని, విజయ్ దేవరకొండ మధ్య పోటీ నడుస్తుందా..?

Exit mobile version