https://oktelugu.com/

Vijay Deverakonda : హే ఏంటి ఇంత ఛేంజ్.. మెడలో రుద్రాక్ష, కాషాయ వస్త్రాలు.. మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అవసరం లేదు. తను తొలి సినిమా అర్జున్ రెడ్డితోనే పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ వెంటనే వచ్చిన గీత గోవిందం సినిమా కూడా రూ.100కోట్లు కలెస్ట్ చేసి తనకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. కానీ ఆ తర్వాత నుంచి వరుస ప్లాఫ్‍లను ఎదుర్కొన్నారు.

Written By: , Updated On : February 10, 2025 / 11:14 AM IST
Vijay Deverakonda

Vijay Deverakonda

Follow us on

Vijay Deverakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అవసరం లేదు. తను తొలి సినిమా అర్జున్ రెడ్డితోనే పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ వెంటనే వచ్చిన గీత గోవిందం సినిమా కూడా రూ.100కోట్లు కలెస్ట్ చేసి తనకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. కానీ ఆ తర్వాత నుంచి వరుస ప్లాఫ్‍లను ఎదుర్కొన్నారు. గతేడాది ది ఫ్యామిలీ స్టార్ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా పెట్టుకుని తీసినా తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీని ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ వీడీ12తో తెరకెక్కిస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఫిబ్రవరి 12న టైటిల్ టీజర్ రానుంది. ఈ తరుణంలో ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళాకు విజయ్ దేవరకొండ వెళ్లారు. అక్కడి పుణ్య నదీ జలాల్లో అమృత స్నానం ఆచరించారు.

విజయ్ తన తల్లి మాధవితో కలిసి ప్రయాగ్‍రాజ్‍కు మహా కుంభమేళాలో పాల్గొనేందుకు వెళ్లారు. అక్కడ ఎవరూ గుర్తించకుండా ముందుగా మాస్క్ పెట్టుకున్నారు. ఆ తర్వాత గంగ, యమున, సరస్వతి నదుల సగమం వద్ద పుణ్య స్నానం ఆచరించారు.. విజయ్, ఆయన తల్లి నదీ జలాల్లో పుణ్య స్నానాలు పాటించారు. మెడలో రుద్రాక్ష మాలలు ధరించారు విజయ్ దేవరకొండ. కాషాయ రంగు పంచె కట్టకున్నారు. షర్ట్ లేకుండా సంప్రదాయబద్ధంగా నదిలో స్నానం చేశారు. చేతులు జోడించి నది మాతకు నమస్కరించారు. పూజల్లో కూడా పాల్గొన్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

విజయ్ కంటే ముందు చాలా మంది సెలబ్రిటీలు మహా కుంభమేళాకు వెళ్లారు. ఇంకా వెళుతున్నారు. పుణ్య స్నానాలు చేస్తున్నారు. తాను ప్రయాగ్‍రాజ్‍కు వెళుతున్నట్లు మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ భార్య ఉపాసన ఇటీవలే పోస్ట్ చేశారు. దగ్గుబాటి రాణా భార్య మహికా బాజాజ్ కూడా మహా కుంభమేళాకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా ప్రయాగ్‍రాజ్ వద్ద పుణ్య స్నానం చేశారు. అలాగే బుల్లితెర నటీనటులు కూడా ప్రయాగ్ రాజ్ వెళ్లారు. ఇది ఇలా ఉంటే వీడీ12 టీజర్ ఫిబ్రవరి 12న రానుంది. దీనిపై ఆయన అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ఈ టీజర్ హిందీ వెర్షన్‍కు బాలీవుడ్ హీరో రణ్‍బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చారని సమాచారం. తెలుగులో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, తమిళంలో హీరో సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీడీ12 టీజర్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.

వీడీ12 టీజర్ మాత్రమే కాకుండా ఆ రోజు టైటిల్ కూడా రివీల్ కానుంది. గౌతమ్ తిన్ననూరి ఈ మూవీని ఇంటెన్స్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విజయ్‍కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్య్చూన్ ఫోర్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‍తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Vijay Deverakonda