L2 Emparan
L2 Emparan : మలయాళం సినిమా ఇండస్ట్రీలో మంచి కాన్సెప్ట్ లతో కథలు వస్తుంటాయి. వాళ్ళు చేసిన సినిమాలు సక్సెస్ సాధించడమే కాకుండా ఇండెప్త్ గా అందులో ఒక సోల్ అయితే ఉంటుంది. ఇక వాళ్లు అటువంటి కొత్త కథలతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు… మోహన్ లాల్ (Mohan Lal) హీరోగా పృధ్వీరాజ్ సుకుమాన్ (Prithvi Raj Sukumaran) దర్శకత్వంలో వచ్చిన ‘లూసిఫర్’ (Lucifer) మూవీ మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ (God Father) పేరుతో చిరంజీవి రీమేక్ చేసినప్పటికి తెలుగులో ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ కూడా తిరకెక్కింది. ‘ఎల్ 2 ఎంపరన్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను చాలా గ్రాండీయర్ తో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ను కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మరోసారి భారీ ఎమోషన్స్ తో కూడిన ఒక డ్రామాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక దాంతో పాటుగా రిచ్ గా తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. కానీ అక్కడక్కడ ఆ భారీతనం అనేది పెద్దగా ఆశించిన మేరకు ఇంపాక్ట్ ని ఇవ్వలేకపోయింది.
Also Read : లూసిఫర్ వర్సెస్ గాడ్ ఫాదర్… కీలకమైన ఆ మూడు పాత్రల నటనలో పైచేయి ఎవరిది?
మొదటి పార్ట్ సక్సెస్ అవ్వడంతో సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలైతే ఉంటాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే వీళ్ళు విజువల్స్ ను కూడా గ్రాండ్ ఇయర్ గా చూపించాలనే దానిమీదనే ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. కథ విషయానికి వస్తే ఒక పర్టికులర్ దానికోసం కథ సాగుతుంది అనేది అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి ఈ సినిమాలో కథ ఏంటి అనేది ఇప్పటివరకు సస్పెన్స్ గానే మిగిలిపోయింది.
మరి మొత్తానికైతే ఈ సినిమా ట్రైలర్ ఇంతవరకు ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నప్పటికి మొదటి పార్ట్ లో ఎలాగైతే ఎమోషన్ ని బిల్డ్ చేశారో సెకండ్ పార్ట్ లో కూడా అంతే ఎమోషన్ ను సస్టెయిన్ చేయలేకపోయారు అనేది ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా విజువల్ గ్రాండీయర్ పైన ఎక్కువ ఫోకస్ అయితే చేశారు. కథ లేకపోయినా విజువల్ గా మనం ప్రేక్షకుడికి కనెక్ట్ చేస్తే బాగుంటుందనే దృక్పథంతోనే వాళ్ళు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ కథలో కంటెంట్ ఉంటేనే సినిమా ప్రతి ప్రేక్షకుడికి రీచ్ అవుతుంది. తద్వారా సినిమా సూపర్ హిట్ అవుతుంది.
అలా వాటన్నింటిని బేస్ చేసుకొని సినిమా తీసినప్పుడే సినిమా సూపర్ సక్సెస్ గా నిలుస్తోంది. లేకపోతే మాత్రం సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకులను మెప్పించలేక పోతుంది. మరి ఈ సినిమా ట్రైలర్ అయితే అంత క్యూరియాసిటిని రేకెత్తించడం లేదు. మరి మార్చి 27వ తేదీన రిలీజ్ అవ్వబోతున్న సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది తద్వారా మోహన్ లాల్ కి ఎలాంటి గుర్తింపు రాబోతుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : లూసీఫర్ లో మోహన్ లాల్ ది 50 నిమిషాలే.. చిరంజీవిది 2 గంటల క్యారెక్టర్?