Telugu News » Odd News » Expensive dog satish from bangalore bought a wolf dog of the kada bomb okami variety
Ad
Expensive Dog : ముకేశ్ అంబానీకి దగ్గర బంధువు అనుకుంటా.. 50 కోట్లతో కుక్కను కొన్నాడు..
Expensive Dog : మనుషులకు, కుక్కలకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఈనాటిది కాదు. వెనుకటి రోజుల నుంచి ఇది కొనసాగుతూనే వస్తున్నది. కుక్కలను మనుషులు చేరదీసే తీరు బాగుంటుంది కాబట్టి.. అవి మనుషులపై అమితమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంటాయి.
Expensive Dog : కుక్కలకు విశ్వాసం ఎక్కువ.. కాసింత అన్నం.. కూసింత మంచినీళ్లు.. పిసరంత ఆశ్రయం కల్పిస్తే చాలు.. అవి తోక ఊపుకుంటూ పక్కనే ఉంటాయి. కాపలాగా ఉంటాయి.. అవసరమైతే వాటి ప్రాణాలు పణంగా పెట్టైనా రక్షణ కల్పిస్తాయి. కుక్కలు చూపించే తెగువను దృష్టిలో పెట్టుకొని వాటిని ఇప్పుడు సైన్యంలో కూడా వాడుతున్నారు. కొన్ని క్లిష్టమైన ఆపరేషన్లను కుక్కల ద్వారానే చేపడుతున్నారు. శత్రువులపై దాడి చేయించడంలో కుక్కలను విరివిగా వినియోగిస్తుంటారు. మనదేశంలో అనేక రకాలైన కుక్క జాతులు ఉన్నాయి. ముఖ్యంగా నాటు జాతుల చెందిన కుక్కలు విపరీతమైన యాక్టివ్ గా ఉంటాయి. శత్రువు కనిపిస్తే చాలు వెంటనే దాడి చేస్తాయి. వాటి పదునైన దంతాలతో చీల్చి చెండాడుతాయి. అందువల్లే కుక్కలకు చాలామంది దూరంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాటికి సమీపంలో వెళ్లడానికి కూడా సాహసించరు…
నాటు జాతులు మాత్రమే కాకుండా.. మనదేశంలో హైబ్రిడ్ కుక్కలు కూడా చాలానే ఉంటాయి. జర్మన్ షెఫర్డ్, ల్యాబ్, వంటి రకాలకు మనదేశంలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వీటికి తగ్గట్టుగానే ధర కూడా ఉంటుంది. వీటికి ఇచ్చే ఫీడ్ చాలా ఖరీదు.. అయితే మనదేశంలో శ్రీమంతులు కుక్కలను కొనుగోలు చేస్తుంటారు. తమ ప్రెస్టేజ్ ను ప్రదర్శిస్తుంటారు. అయితే బెంగళూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి “కాడా బాంబ్ ఒకామి” రకానికి చెందిన “వోల్ఫ్ డాగ్” ను కొనుగోలు చేశాడు. తిని విలువ 5.7 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో దాదాపు 50 కోట్లు.. సతీష్ కు కుక్కలు అంటే చాలా ఇష్టం. వాటిని పెంచుకోవడం అంటే అతడికి చాలా సరదా. అందువల్లే వోల్ఫ్ డాగ్ ను అతడు కొనుగోలు చేశాడు.. అతడు శ్రీమంతుడు కావడంతో ప్రత్యేకమైన కుక్కలను కొనుగోలు చేస్తుంటాడు. వాటిని భారతదేశానికి పరిచయం చేస్తుంటాడు.. అన్నట్టు ఈ కుక్క అమెరికాలో జన్మించింది. దాని వయసు 8 నెలలు. ఇది ఉడికించిన గుడ్లతో పాటు మూడు కిలోల పచ్చి చికెన్ తినేస్తుంది. పెద్దగా అరవదు. ఎవరైనా అపరిచితులు వస్తే కరవడం మానదు. దీని దంతాలు అత్యంత పదునుగా ఉంటాయి. చీల్చి చెండాడడంలో అవి ఉపకరిస్తాయి. అందువల్లే ఈ కుక్కకు వోల్ఫ్ డాగ్ అనే పేరు వచ్చింది. తోడేలు మాదిరిగానే ఈ కుక్కకు దంతాలు ఉంటాయి. కాకపోతే ఈ కుక్క తక్కువ ఎత్తు ఉంటుంది. నక్కతోకను పోలి ఉంటుంది. ఒంటిపై రోమాలు మందంగా ఉంటాయి. ఇవి దాని శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంటాయి.
అమెరికన్ సైన్యంలో ఓల్ఫ్ డాగ్ లను ఎక్కువగా వాడుతుంటారు. ఇవి ఎటువంటి విపత్కర పరిస్థితులలోనైనా శత్రువులపై దాడి చేస్తాయి. ముఖ్యంగా మంచు కురిసే ప్రాంతాలలో.. ఎండగా ఉండే ప్రాంతాలలో వీటిని అమెరికన్ సైన్యం వాడుతూ ఉంటుంది. అరుదైన సందర్భాల్లో శత్రువులపై దాడి చేయడానికి వీటిని ఉపయోగిస్తూ ఉంటుంది. ఇవి కొన్ని సందర్భాల్లో శత్రువుల ప్రాణాలు కూడా తీయగలవు. అందువల్లే వీటిని అత్యంత ప్రమాదకరమైన కుక్కలు అని పిలుస్తుంటారు.