Homeఎంటర్టైన్మెంట్మెగాస్టార్ కి కథ చెప్పనున్న వెంకీ !

మెగాస్టార్ కి కథ చెప్పనున్న వెంకీ !

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాకా.. వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా ఉన్నాడు. అందుకే చాలామంది డైరెక్టర్లు మెగాస్టార్ కోసం కొత్త కథలు రాయడం మొదలెట్టారు. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా చిరు కోసం ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో సాగే స్క్రిప్ట్ రెడీ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఎలాగూ మెగాస్టార్ కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి, తన కథను ఓకే చేస్తాడు అని ఈ యంగ్ డైరెక్టర్ ఆశ. […]

Venky chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాకా.. వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా ఉన్నాడు. అందుకే చాలామంది డైరెక్టర్లు మెగాస్టార్ కోసం కొత్త కథలు రాయడం మొదలెట్టారు. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా చిరు కోసం ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో సాగే స్క్రిప్ట్ రెడీ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఎలాగూ మెగాస్టార్ కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి, తన కథను ఓకే చేస్తాడు అని ఈ యంగ్ డైరెక్టర్ ఆశ. ఇక జనవరి రెండో వారంలో మెగాస్టార్ కి వెంకీ కథ చెప్పనున్నాడు. మరి చూడాలి వెంకీ కథ.. మెగాస్టార్ కి ఎంతవరకు నచ్చుతుందో.

Also Read: మళ్లీ హోస్ట్‌గా ఎన్టీఆర్.. రెమ్యునరేషన్‌ ఎంతంటే !

ఇక మలయాళంలో ‘లూసిఫర్’ అనే సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమా మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మొదట ఈ సినిమాకి సుజీత్ దర్సకత్వం అనుకోవడం, సుజీత్ కూడా స్క్రిప్ట్ వర్క్ కూడా చేశాకా .. పరిస్థితులు అనుకూలంగా లేవు అని సుజీత్ ను తప్పించి.. ఆ తరువాత దర్శకుడు వినాయక్ డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి. వినాయక్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి చెబితే.. చిరుకు ఆ మార్పులు నచ్చలేదు. దాంతో ఈ సినిమా మళ్ళీ సుజిత్ దగ్గరకే వెళ్ళింది.

Also Read: ‘బెల్‌ బాటమ్‌’ సినిమా ఎలా ఉంది అంటే.. ?

కాగా సుజిత్ తాజాగా చిరు కోసం ఈ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారని.. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ విషయంలో కూడా భారీగానే ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర కథా పరంగా చాల కీలకమైనది. ఎక్కువగా సినిమాలో హీరో తన అసిస్టెంట్ చేతే చేయిస్తూ ఉంటాడు కాబట్టి.. ఇప్పుడు ఈ పాత్ర కోసం మరో హీరోని అనుకుంటున్నారు. నిజానికి మొదట ఆ పాత్రలో అల్లు అర్జున్ నటించాలని ఇంట్రస్ట్ చూపించినా.. కొన్ని కారణాల వల్ల ఆ పాత్రలో బన్నీ చెయ్యట్లేదు. ఇక ఈ సినిమాలో హీరోకి చెల్లి పాత్రలో సుహాసిని నటించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper