Homeఎంటర్టైన్మెంట్ఎక్స్ క్లూజివ్ : తెలుగు స్టార్ మేకర్స్ తో తమిళ స్టార్ హీరో !

ఎక్స్ క్లూజివ్ : తెలుగు స్టార్ మేకర్స్ తో తమిళ స్టార్ హీరో !

ప్రతి స్టార్ హీరోకి ఇప్పుడు ఒక్కటే ఆశ, పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలి అని. అది అందరికీ సెట్ అయ్యే ఇమేజ్ కాదు. లోకల్ గా తోపు అయినా నేషనల్ రేంజ్ లో అనామకుడిగానే ఉండాల్సి వస్తోంది. నిజానికి తమిళంలో సూపర్ స్టార్ గా ఎనలేని క్రేజ్ సాధించాడు హీరో విజయ్. ఐతే, విజయ్ దాదాపు పదేళ్ల నుండే సౌత్ ఇండియా స్టార్ అనిపించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. కానీ, విజయ్ చేసిన ప్రయత్నాలలో ఏది పెద్దగా […]

Vamshi Paidipally Vijayప్రతి స్టార్ హీరోకి ఇప్పుడు ఒక్కటే ఆశ, పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలి అని. అది అందరికీ సెట్ అయ్యే ఇమేజ్ కాదు. లోకల్ గా తోపు అయినా నేషనల్ రేంజ్ లో అనామకుడిగానే ఉండాల్సి వస్తోంది. నిజానికి తమిళంలో సూపర్ స్టార్ గా ఎనలేని క్రేజ్ సాధించాడు హీరో విజయ్. ఐతే, విజయ్ దాదాపు పదేళ్ల నుండే సౌత్ ఇండియా స్టార్ అనిపించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు.

కానీ, విజయ్ చేసిన ప్రయత్నాలలో ఏది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడిప్పుడే అతనికి తెలుగులో మార్కెట్ క్రియేట్ అవుతూ ఉంది. అది గమనించిన ఈ హీరో ఆ మార్కెట్ కి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి ఇప్పుడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తెలుగులో మార్కెట్ పెరగాలి అంటే.. తెలుగు పై మరింత ఫోకస్ పెట్టాలి, అందుకే విజయ్ ప్రస్తుతం తెలుగు పై ఎక్కువ దృష్టి పెడుతున్నాడు.

తమిళ హీరోల్లో అందరికన్నా తెలుగులో ఎక్కువ మార్కెట్ ఉన్న హీరో ‘కార్తీ’నే. మొదట తన డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లితో తెలుగులో ‘ఊపిరి’ అనే సినిమా చేశాడు. కేవలం ఆ సినిమా వల్ల కార్తీకి తెలుగులో మార్కెట్ మరింతగా పెరిగింది. అప్పటికే తెలుగువారికి మరింతగా చేరువైన తన అన్నయ్య సూర్య కంటే కూడా, కార్తీ ‘ఊపిరి’తో తెలుగులో ఇంకా ఎక్కువ మార్కెట్ అలాగే స్టార్ ఇమేజ్ ను సాధించాడు.

మొత్తానికి కార్తీనే ఫాలో అవ్వడానికి సిద్ధం అయ్యాడు విజయ్. తెలుగులో కూడా తనకు మంచి మార్కెట్ రావాలి అన్నా, అలాగే తెలుగులో కూడా తనకు స్టార్ ఇమేజ్ రావాలి అన్నా, తానూ కూడా కార్తీలాగే డైరెక్ట్ తెలుగు స్టార్ మేకర్స్ తో సినిమా చేయాలని విజయ్ ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగా ఇటీవల నిర్మాత దిల్ రాజుతో పర్సనల్ గా చర్చలు కూడా జరిపాడు. ఇద్దరూ కలిసి సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు.

ఆ సినిమాకి సంబంధించి ఎక్స్ క్లూజివ్ న్యూస్ ఏమిటంటే.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా, దిల్ రాజు నిర్మాతగా సినిమా రాబోతుంది. రీసెంట్ గా వంశీ పైడిపల్లి, విజయ్ ను కలిసి కథ చెప్పాడు. విజయ్ కి కథ నచ్చిందని టాక్, వీరి కాంబినేషన్ లో త్వరలో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం మొదలుకానుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper