spot_img
Homeఎంటర్టైన్మెంట్‘వ‌కీల్ సాబ్’ క‌లెక్ష‌న్ల సునామీ.. ఇండ‌స్ట్రీలో స‌రికొత్త చ‌రిత్ర‌!

‘వ‌కీల్ సాబ్’ క‌లెక్ష‌న్ల సునామీ.. ఇండ‌స్ట్రీలో స‌రికొత్త చ‌రిత్ర‌!

Vakeel Saab Collections

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టామినాకు బాక్సాఫీస్ షేకైపోతోంది. వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం కొన‌సాగుతోంది. అత్యంత భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన వ‌కీల్ సాబ్ చిత్రం.. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే నెవ్వ‌ర్ బిఫోర్ రికార్డుల‌ను న‌మోదు చేస్తోంది. లాంగ్ ర‌న్ లో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ అన‌లిస్టులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తొలిరోజు క‌లెక్ష‌న్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

హైద‌రాబాద్ లో సుమారు 400 షోల‌ను ప్లాన్ ‌చేశారు మేక‌ర్స్‌. న‌గ‌రంలో ఒక‌టీ రెండు మిన‌హా దాదాపు అన్ని థియేట‌ర్ల‌లోనూ వ‌కీల్ సాబ్ బొమ్మ ప‌డింది. మూడేళ్లుగా ఆక‌లితో ఉన్న ఫ్యాన్స్ తోపాటు సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా కుమ్మేశారు. దాదాపు అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేశారు. దీంతో.. తొలిరోజున 5.50 కోట్లు వ‌సూళ్లు చేసే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ తొలిరోజు రికార్డు మ‌హేష్ బాబు ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ పేరిట ఉంది. ఈ చిత‌రం రూ.4.39 కోట్లు వ‌సూలు చేసింది. ఆ రికార్డును వ‌కీల్ సాబ్ తిర‌గ‌రాయ‌బోతున్నాడ‌ని అంటున్నారు.

ఇక‌, ఫారెన్ లోనూ వ‌కీల్ సాబ్ దుమ్ములేపుతున్నాడు. అమెరికాలో ప‌వ‌ర్ స్టార బాక్సాఫీస్ వార్ అత్యంత ఘ‌నంగా మొద‌లు పెట్టాడు. స‌మారు 226 లొకేష‌న్ల‌లో రిలీజైన ఈ చిత్రం తొలి రోజున 364కే డాల‌ర్ల‌ను వ‌సూలు చేసిన‌ట్టు తెలుస్తోంది. క‌రోనా లాక్ డౌన్ త‌ర్వాత అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ గా రికార్డు న‌మోదు చేసింది.

అటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లోనూ ఈ చిత్రం భారీ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. ఆసీస్ లో మొత్తం 58 లొకేష‌న్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం 1.45ల‌క్ష‌ల ఆస్ట్రేలియ‌న్ డాల‌ర్లు కొల్ల‌గొట్టింది. న్యూజీలాండ్ లో 17 చోట్ల విడుద‌లై 8,302 కివీస్‌డాల‌ర్లు రాబ‌ట్టింది. ఈ విధంగా.. ప్ర‌పంచ వ్యాప్తంగా వకీల్ సాబ్ రికార్డు స్థాయి వ‌సూళ్లు రాబ‌డుతున్నాడు. ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నాల ప్ర‌కారం తొలిరోజే 32 కోట్ల షేర్ ను ఈ చిత్రం రాబ‌డుతుంద‌ని భావిస్తున్నారు. దీంతో.. లాంగ్ ర‌న్ లో వ‌కీల్ సాబ్ సృష్టించే ప్ర‌భంజ‌నం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper
Exit mobile version