వకీల్ సాబ్ మూవీ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఈ చిత్రం రికార్డులను తిరగరాస్తూ బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకెళుతోంది. ఇప్పుడంతా ‘వకీల్ సాబ్’ గురించే ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాపై ఫ్యాన్స్, ఇతర ప్రేక్షకులే కాకుండా టాలీవుడ్ కు చెందిన ప్రముఖ స్టార్లు సైతం ఆసక్తి కనబరిచారు. తమ పనులను పక్కనబెట్టి సినిమాను చూశారు. ఇప్పటికే ఈ సినిమా గురించి రకరకాలుగా […]
వకీల్ సాబ్ మూవీ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఈ చిత్రం రికార్డులను తిరగరాస్తూ బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకెళుతోంది. ఇప్పుడంతా ‘వకీల్ సాబ్’ గురించే ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాపై ఫ్యాన్స్, ఇతర ప్రేక్షకులే కాకుండా టాలీవుడ్ కు చెందిన ప్రముఖ స్టార్లు సైతం ఆసక్తి కనబరిచారు. తమ పనులను పక్కనబెట్టి సినిమాను చూశారు. ఇప్పటికే ఈ సినిమా గురించి రకరకాలుగా మాట్లాడిన టాలీవుడ్ నటులు సినిమా రిలీజ్ అవ్వగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా థియేటర్లో చూసేశారు. ఆ తరువాత సినిమాపై తమ అభిప్రాయాలు చెప్పేశారు.
తాజాగా దర్శకధీరుడు రాజమౌళి సైతం తొలిరోజే థియేటర్లో ఈ సినిమాను చూశారు. ఆర్ఆర్ఆర్ వంటి ప్యాన్ ఇండియా మూవీ తీస్తున్న రాజమౌళి ఈ సినిమా గురించి హాట్ హాట్ కామెంట్లు చేశాడు. సినిమా చూసిన అనంతరం థియేటర్ బయట మీడియాతో మాట్లాడారు. ‘ హిందీలో పింక్ మూవీ కూడా చూశా.. కానీ మన డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెలుగులో ‘వకీల్ సాబ్’ను చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా ఇందులో పవన్ ను చూపించిన విధానం చాలా బాగుంది. ఇక సినిమాలో బ్యాక్ రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. థమన్ అందించిన పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.. చాలా రోజుల తరువాత పవన్ ఇలాంటి సినిమాలో చూస్తానని అనుకోలేదు. కచ్చితంగా సినిమా బంపర్ హిట్టు కొడుతుంది’అని రాజమౌళి అన్నారు.
ఇక బాబాయ్ వకీల్ సాబ్ ను చూసిన రాంచరణ్ సైతం ఈ చిత్రం గురించి తనదైన శైలిలో ఆనందం వ్యక్తం చేశాడు. ‘నాన్న లాగానే.. బాబాయ్ గొప్ప స్టోరీలను ఎంచుకొని సినిమా తీస్తున్నాడు.. సమాజానికి మెసేజ్ ఇచ్చే ఇలాంటి సినిమాలు చేయడం చాలా గ్రేట్. సాధారణంగా ఇలాంటి సినిమాలు చేయాలంటే కొంచెం గట్స్ కావాలి. అందుకే బాబాయ్ ఈ సినిమాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బాబాయ్ చాలా రోజుల తరువాత టాలీవుడ్ ను షేక్ చేశాడు’ అంటూ రామ్ చరణ్ కామెంట్ చేశాడు.