Ustaad Bhagat Singh vs Durandhar 2 Box Office: సినిమా ఇండస్ట్రీలో ఒకేరోజు రిలీజ్ అయ్యే సినిమాల మధ్య పోటీ విపరీతంగా ఉంటుంది. ఒక సినిమాకి సక్సెస్ ఫుల్ టాక్ వస్తే మరో సినిమా డీలా పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రేక్షకులందరు సక్సెస్ ఫుల్ సినిమాలను చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. తద్వారా డివైడ్ టాక్ వచ్చిన సినిమాలను, ప్లాప్ టాక్ వచ్చిన సినిమాలను పట్టించుకునే ఆస్కారం లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ఉస్తాద్ భగత్ సింగ్, రన్వీర్ సింగ్ హీరోగా చేసిన ‘దురంధర్ 2’ రెండు సినిమాలు ఈరోజు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీమియర్ షోస్ రివ్యూ…మామూలు రచ్చ కాదుగా..?
రెండు సినిమాలు ఈరోజు రిలీజ్ అవ్వడంతో ఏ సినిమా ఎలాంటి టాక్ ను సంపాదించుకుందనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… పవన్ కళ్యాణ్ ఫుల్ లెంత్ కమర్షియల్ సినిమా చేసి చాలా రోజులు అవుతుంది. అందువల్ల ఆయన నుంచి వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది.
దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ మేనియా మరోసారి రిపీట్ అయిందంటూ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు… మొత్తానికైతే ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. గత సంవత్సరం రన్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘దురంధర్’ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి…
ఇక మొదటి షో తో ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో రెండు సినిమాలు సక్సెస్ ఫూల్ గా ముందుకు సాగుతున్నాయి. ప్రేక్షకులందరు ఈ రెండు సినిమాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ మూడు రోజులు గడిస్తే గాని ఈ రెండు సినిమాల్లో ఏ మూవీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఏ సినిమా డీలా పడిపోయింది అనేది క్లారిటీగా తెలియదు…
