ఈ నెల 26 న విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్(Deputy Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా అన్ని ప్రాంతాల్లో క్లోజ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రైట్స్ దాదాపుగా 120 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. కానీ ఓవర్సీస్ లో మాత్రం చాలా తక్కువ రేట్ కి ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘ఓజీ’ దాదాపుగా ఓవర్సీస్ లో 8 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు అన్నమాట. అంత వసూళ్లను రాబట్టిన ‘ఓజీ ‘ లాంటి చిత్రం తర్వాత విడుదలయ్యే ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ఓవర్సీస్ రైట్స్ కనీసం 4 మిలియన్ డాలర్లకు అయినా అమ్ముడుపోవాలి కదా ?, కానీ అది జరగలేదు.
ఓవర్సీస్ మొత్తం కలిపి మూడు మిలియన్ డాలర్ల లోపే థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఇది చాలా దారుణం అనే చెప్పాలి. ఇందులో నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ కేవలం 2.4 మిలియన్ డాలర్ల రేట్ కి అమ్ముడుపోయింది. ఓజీ చిత్రం ఈ ఒక్క ప్రాంతం నుండే 5.6 మిలియన్ డాలర్లకు పైగా అమ్ముడుపోయింది. కేవలం ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రం నార్త్ అమెరికా నుండి 3 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలాంటిది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కేవలం 2.4 మిలియన్ డాలర్స్ కి అమ్ముడుపోవడం ఏంటో ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న . దీనిపై సోషల్ మీడియా లో ఇతర హీరోల అభిమానులు వేరే లెవెల్ లో ట్రోల్స్ వేస్తున్నారు. అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రానికి ఓవర్సీస్ లో ఇంత తక్కువ బిజినెస్ జరగడానికి గల కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం.
ఈమధ్య కాలం లో ఓవర్సీస్ ప్రాంతంలో భారీ హైప్ ఉన్న సినిమాలు మాత్రమే భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఓజీ చిత్రానికి భారీ హైప్, క్రేజ్ ఉండేది, కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రానికి అందులో పావు శాతం హైప్ కూడా లేదు. అందుకే ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ఇంత తక్కువకు అమ్ముడుపోయాయి. అంతే కాకుండా ఈమధ్య కాలం లో విడుదలైన స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలు టాక్ కాస్త తేడా రావడం తో డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. ఫలితంగా కనీసం రెండు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయాయి. పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రం ఒక రొటీన్ కమర్షియల్ మూవీ , పైగా డైరెక్టర్ హరీష్ శంకర్ పై అక్కడి బయ్యర్స్ లో ఎలాంటి నమ్మకం లేదు, అందుకే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని ఇంత తక్కువకి కొనుగోలు చేసారని అంటున్నారు. అయితే రాబోయే రోజుల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రం లోని కంటెంట్ బయటకు వచ్చే కొద్దీ ఈ చిత్రం క్రేజ్ పెరుగుతుంది. అదే కనుక జరిగితే కేవలం ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.