spot_img
Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Day 2 Collections: 2వ రోజు భారీగా పడిపోయిన 'ఉస్తాద్ భగత్...

Ustaad Bhagat Singh Day 2 Collections: 2వ రోజు భారీగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్లు.. ఎంత గ్రాస్ వచ్చిందంటే!

Ustaad Bhagat Singh Day 2 Collections: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లోనే అత్యంత తక్కువ బజ్ తో విడుదలైన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). ఈ సినిమా ని ప్రకటించిన కొత్తల్లో ఫ్యాన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బాగా బిజీ అవ్వడం వల్ల ఈ సినిమాకు మార్కెట్ లో ఉన్న బజ్ మొత్తం పోయింది. పైగా విడుదలకు ముందు ఒక్క ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం సినిమా ఓపెనింగ్స్ పై తీవ్రమైన ప్రభావం చూపించింది. ఓజీ చిత్రం తో కేవలం నైజాం ప్రాంతం నుండే పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మొదటి రోజే రాబట్టిన పవన్ కళ్యాణ్, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో వరల్డ్ వైడ్ గా కేవలం 32 కోట్ల రూపాయిలను మాత్రమే రాబట్టాడు.

Also Read: ఆ పెంపుడు కుక్కతోనే అమెరికాకు అణుముప్పు.. ఇంటెలిజెన్స్‌ సంచలన నివేదిక

దీనిని బట్టీ ఈ చిత్రానికి మార్కెట్ లో ఎంత దారుణమైన బజ్ ఉన్నిందో మీరే అర్థం చేసుకోండి. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన రెండవ రోజు వసూళ్లు కూడా బాగా తగ్గిపోయాయి. నూన్ షోస్ చాలా వీక్ గా ఉన్నాయి. మ్యాట్నీ షోస్ నుండి నైజాం ప్రాంతం కాస్త ఊపందుకుంది. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా మ్యాట్నీ షోస్ నుండి బాగానే పికప్ అయ్యాయి. అదే విధంగా కృష్ణా , గుంటూరు , సీడెడ్ ప్రాంతాల్లో ఫస్ట్ నుండి బాగా పికప్ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి రెండవ రోజున 8 నుండి 10 కోట్ల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చేలా కనిపిస్తోంది కానీ, అది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు ఏ మాత్రం సరిపోదు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 130 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి.

అంటే వీకెండ్ కి కచ్చితంగా 85 నుండి 90 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. కానీ ఆ సూచనలు అసలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి వీకెండ్ పూర్తి అయ్యే సరికి 65 నుండి 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫుల్ రన్ లో సమ్మర్ కలిసొస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం దాదాపుగా అసాధ్యమే అని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతానికి బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 9 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. మొదటి రోజు దాదాపుగా 7 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోగా, రెండవ రోజు 1 లక్షా 50 వేల టిక్కెట్లు బుక్ మై షో యాప్ ద్వారా అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Oktelugu Epaper