Homeఎంటర్టైన్మెంట్Teja Sajja Reality Show Host: తెలుగులో మరో పెద్ద రియాలిటీ షో..హోస్ట్ గా తేజ...

Teja Sajja Reality Show Host: తెలుగులో మరో పెద్ద రియాలిటీ షో..హోస్ట్ గా తేజ సజ్జ..పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!

Teja Sajja Reality Show Host: బాలీవుడ్ లాగానే మన టాలీవుడ్ కూడా రియాలిటీ షోస్ కి అడ్డా గా మారిపోతోంది. ఇప్పటికే బిగ్ బాస్ రియాలిటీ షో మన ఆడియన్స్ కి ఎంత దగ్గరైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతీ ఏడాది సెప్టెంబర్ నెలలో మొదలయ్యే ఈ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి రియాలిటీ షోస్ బాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ […]

Teja Sajja Reality Show Host: బాలీవుడ్ లాగానే మన టాలీవుడ్ కూడా రియాలిటీ షోస్ కి అడ్డా గా మారిపోతోంది. ఇప్పటికే బిగ్ బాస్ రియాలిటీ షో మన ఆడియన్స్ కి ఎంత దగ్గరైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతీ ఏడాది సెప్టెంబర్ నెలలో మొదలయ్యే ఈ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి రియాలిటీ షోస్ బాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ అనే రియాలిటీ షో మొదలైన సంగతి తెలిసిందే. ఇది కూడా బాలీవుడ్ లోని ఒక రియాలిటీ షో కి రీమేక్ అని చెప్పొచ్చు. ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో కి ఎందుకో ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవ్వడం లేదు. మీ ప్రేమ వ్యవహారాలు మాకు ఎందుకు , చాలా సోది గేమ్ షో లాగా అనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

Also Read: ఆ పెంపుడు కుక్కతోనే అమెరికాకు అణుముప్పు.. ఇంటెలిజెన్స్‌ సంచలన నివేదిక..

ఇది కాసేపు పక్కన పెడితే త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఒక రియాలిటీ షో మొదలు కాబోతుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘ది ట్రైటర్స్ ‘ గేమ్ షో ని తెలుగు లోకి తీసుకొస్తున్నారు. ఈ షో కి వ్యాఖ్యాతగా ప్రముఖ యంగ్ హీరో తేజ సజ్జ వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ వేరు. అలాంటి షో కి తేజ సజ్జ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతుండడం ఆయన కెరీర్ లో అతి పెద్ద మైలు రాయి అని చెప్పొచ్చు. బాలీవుడ్ లో ఈ షోకి వ్యాఖ్యాతగా, నిర్మాతగా కరణ్ జోహార్ వ్యవహరించాడు. జైసల్మీర్ లోని సూర్య గడ్ ప్యాలెస్ లో ఈ రియాలిటీ షో జరిగింది. తెలుగు వెర్షన్ కూడా ఇక్కడే జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ షో లో మన తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన సెలబ్రిటీలతో పాటు, పలువురు మూవీ హీరోయిన్స్ కూడా భాగం కాబోతున్నారు. త్వరలోనే ఈ షోకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి అంతర్జాతీయ స్థాయిలో సెన్సేషన్ సృష్టించిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, మన తెలుగు లో ఎంతమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అయితే ఈ షో టీవీ లో మాత్రం టెలికాస్ట్ అయ్యే అవకాశాలు లేవు. కేవలం అమెజాన్ ప్రైమ్ వీడియో లో మాత్రమే ఈ రియాలిటీ షో ని చూసే అవకాశం ఉంటుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper