Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh 10 Days Collections: 'ఉస్తాద్ భగత్ సింగ్' 10 రోజుల వరల్డ్...

Ustaad Bhagat Singh 10 Days Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మాయని మచ్చ ఇది..

Ustaad Bhagat Singh 10 Days Collections: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో హిట్లు ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి, కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) లాంటి చిత్రం మాత్రం లేదు. హిట్టు , ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రతీ సినిమాకు భారీ ఓపెనింగ్స్ పెట్టడం పవన్ కళ్యాణ్ స్టైల్. కానీ ఈసారి ఓపెనింగ్స్ కూడా లేవు. ఎంత దారుణం అంటే మొదటి రోజే వంద కోట్ల గ్రాస్ వసూళ్లను […]

Ustaad Bhagat Singh 10 Days Collections: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో హిట్లు ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి, కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) లాంటి చిత్రం మాత్రం లేదు. హిట్టు , ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రతీ సినిమాకు భారీ ఓపెనింగ్స్ పెట్టడం పవన్ కళ్యాణ్ స్టైల్. కానీ ఈసారి ఓపెనింగ్స్ కూడా లేవు. ఎంత దారుణం అంటే మొదటి రోజే వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగలిగే సత్తా ఉన్న పవన్ కళ్యాణ్, పది రోజులు పూర్తి అయినా ఇప్పటికీ `100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టలేకపోయాడు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అనేది. ‘ఓజీ’ లాంటి హిట్ తర్వాత ఇలాంటి ఫ్లాప్ చిత్రం రావడం అనేది నిజంగా దురదృష్టకరమే. ఇకపోతే 10 రోజుల్లో ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత షేర్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 10 వ రోజున 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఇక పది రోజులకు కలిపి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే. నైజాం ప్రాంతం నుండి 17 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, సీడెడ్ ప్రాంతం నుండి 8 కోట్ల 50 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 7 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా నుండి 5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 4 కోట్లు , గుంటూరు జిల్లా నుండి 4 కోట్ల 30 లక్షలు, కృష్ణ జిల్లా నుండి 4 కోట్లు, నెల్లూరు జిల్లా నుండి కోటి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుండి 51.5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇక ఇతర ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 3 కోట్ల 44 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, ఓవర్సీస్ నుండి 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రం 59 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 97 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఇక్కడ ఒక్క విషయం లో సంతోషించవచ్చు. ఈ చిత్రానికి క్లోజింగ్ లో వంద కోట్ల గ్రాస్ కూడా రావడం కష్టమని అంత అనుకున్నారు. కానీ ఎట్టకేలకు ఈరోజు రేపటి తో ఆ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు, ఇప్పటికీ ఈ చిత్రం బుక్ మై షో లో ట్రెండ్ అవుతూనే ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper