Ustaad Bhagat Singh Netflix views: ఈ ఏడాది విడుదలైన పెద్ద హీరోల సినిమాల్లో అతి పెద్ద డిజాస్టర్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). ‘ఓజీ’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి వచ్చిన ఈ సినిమా అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో చాలా ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి కానీ , ఈ రేంజ్ క్రింజ్ చిత్రాన్ని చూడలేదని , ఇలాంటి సినిమా ఎలా తీశావు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు, నెటిజెన్స్ డైరెక్టర్ హరీష్ శంకర్ ని ట్యాగ్ చేసి ఒక రేంజ్ లో తిట్టారు. నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యాక , ఇక్కడ కూడా ఈ చిత్రాన్ని చూసి నెటిజెన్స్ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. కానీ నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రానికి వ్యూయర్ షిప్ మాత్రం సూపర్ హిట్ రేంజ్ లోనే ఉంది.
నెట్ ఫ్లిక్స్ అందించిన గణాంకాల ప్రకారం ఈ చిత్రానికి మొదటి 11 రోజుల్లో 44 లక్షల వ్యూస్ వచ్చాయని, మొదటి నాలుగు రోజుల వ్యూస్ దాదాపుగా 24 లక్షల వరకు వచ్చిందని చెప్పుకొచ్చారు. అంటే రెండవ వారం లో దాదాపుగా 20 లక్షల మంది చిత్రాన్ని వీక్షించారు అన్నమాట. ఇది చిన్న విషయం కాదు , ఇప్పటికీ ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో 10 దేశాల్లో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా అరబ్ దేశాల్లో మొదట్లో 10 వ స్థానం లో ట్రెండ్ అయ్యేది , ఇప్పుడు మూడవ స్థానానికి ఎగబాకింది. అంటే ఈ చిత్రాన్ని వీకించే ఆడియన్స్ సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వెళ్తోంది. మూడవ వారంలో కూడా ఈ చిత్రానికి 10 లక్షలకు పైగా వ్యూస్ వస్తే మాత్రం , ఓటీటీ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని ఈ చిత్రం సొంతం చేసుకుందని చెప్పొచ్చు.
సాధారణంగా నెట్ ఫ్లిక్స్ లో అరబ్ దేశాలకు చెందిన వాళ్ళు , వెస్ట్రన్ దేశాలకు చెందిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. వీరిలో అరబ్ దేశాలకు చెందిన వాళ్ళు అత్యధిక శాతం కమర్షియల్ సినిమాలను చూసేందుకు ఇష్టపడుతారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి ఆడియన్స్ నుండి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చి ఉండొచ్చు కానీ , పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కావడం, అందులోనూ ఆయన గత చిత్రం ఓజీ కి నెట్ ఫ్లిక్స్ లో కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ రావడం వల్ల , ఇతర దేశాల్లో ఆడియన్స్ పవన్ కళ్యాణ్ సినిమాలకు అలవాటు పడ్డారని, ఆ కారణం చేతనే ఈ చిత్రానికి ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు. మరి లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.