Urvashi Rautela: సౌత్ ఇండియా లో ఈమధ్య కాలం లో గట్టిగా వినపడింది పేరు ఊర్వశి రౌతేలా(Oorvasi Rautela). మెగాస్టార్ చిరంజీవి(Megatsar Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో ‘బాస్ పార్టీ’ అనే పాట ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ పాట పెద్ద హిట్ అవ్వడంతో యూత్ ఆడియన్స్ కి ఊర్వశి రౌతేలా ఫేవరెట్ బ్యూటీ గా మారిపోయింది. ఈ చిత్రం తర్వాత పలు మ్యూజిక్ వీడియోస్ లో హల్చల్ చేసిన ఊర్వశి, కోలీవుడ్ లో శరవణన్ హీరో గా నటించిన ‘ది లెజెండ్’ చిత్రంలో విలన్ గా నటించింది. ఇక రీసెంట్ గా ఈమె నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) సూపర్ హిట్ చిత్రం ‘డాకు మహారాజ్'(Daaku Maharaj Movie) చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అంతే కాదు బాలయ్య తో కలిసి ఆమె ‘దబిడి..దిబిడి’ సాంగ్ లో వేసిన స్టెప్పులు ఎంత హైలైట్ అయ్యాయో మనమంతా చూసాము.
Also Read: హీరోయిన్ రమ్యకృష్ణ తో విడాకులపై మొట్టమొదటిసారి స్పందించిన డైరెక్టర్ కృష్ణ వంశీ!
అంతే కాదు,ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా లో కూడా నిత్యం యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారులను పిచ్చెక్కిపోయేలా చేస్తూ ఉంటుంది. అంతే కాదు అప్పుడప్పుడు ఈమె కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే ప్రముఖ యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్(Rishab Pant) తో ఈమె చాలా కాలం నుండి డేటింగ్ చేసిందని, ఘాడమైన లవ్ రిలేషన్ ని మైంటైన్ చేస్తూ వచ్చిన వీళ్లిద్దరు కొన్ని అనుకోని సంఘటనల కారణంగా విడిపోయారని బాలీవుడ్ లో ఒక రూమర్ ఉంది. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు కానీ, రీసెంట్ గానే ఒర్రీ అనే వ్యక్తి గురించి ఈమె ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్, దానికి ఆయన ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది.
ఒర్రీ అనే వ్యక్తి సోషల్ మీడియా ని ఉపయోగించే వాళ్లకు తెలియకుండా ఉండదు. ఇతను ప్రముఖ సెలబ్రిటీస్ తో హాట్ సెల్ఫీలు దిగుతూ చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటాడు. ఇతని వేషధారణ, ప్రవర్తనని చూసి నెటిజెన్స్ ఇతన్ని గే అని పిలుస్తూ ఉంటారు. రీసెంట్ గా ఊర్వశి ఇతనితో దిగిన ఒక ఫోటో ని తన స్టోరీ లో పెడుతూ ‘నీకు తొందరగా పెళ్లి అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అంటుంది. దానికి ఒర్రీ సమాధానం చెప్తూ ‘నీకు కాదు..మన పెళ్లి పెళ్లి తొందరగా అవ్వాలి అని కోరుకో’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీనిని చూసిన నెటిజెన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అప్సరస లాగా కనిపించే ఊర్వశి తో ఇతనికి పెళ్లా?, ఏమి చేసుకోను అంటూ వెటకారంగా కామెంట్స్ చేసారు. అయితే ఒర్రీ సమాధానం కి ఊర్వశి నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోవడం గమనార్హం. నిజంగానే ఆయన అలా అన్నాడా?, లేకపోతే సరదాగా అలా అన్నాడా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: మజాకా ఫస్ట్ డే కలెక్షన్స్… అసలు ఇది ఊహించని పరిణామం! ట్రేడ్ వర్గాలకు షాక్