Ramya Krishna : టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ లో ఇప్పటికీ మంచి డిమాండ్ మీద కొనసాగుతున్న హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది రమ్యకృష్ణ(Ramyakrishna) అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు ఈమె టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరు, కానీ ఇప్పుడు ఇండియా లో మోస్ట్ వాంటెడ్ క్యారక్టర్ ఆర్టిస్టులలో ఒకరు అని చెప్పొచ్చు. బాహుబలి(Bahubali Movie) సిరీస్ లో హీరో ప్రభాస్(Rebel Star Prabhas) తో సమానమైన పవర్ ఫుల్ క్యారక్టర్ చేసి దేశం మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇప్పటికీ ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి కానీ, చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతుంది. ఏడాదికి తెలుగు, తమిళ భాషలకు కలిపి 3 నుండి నాలుగు సినిమాలు చేస్తుంది. ఈమె రెమ్యూనరేషన్ కూడా రెండు కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని టాక్. ఇదంతా పక్కన పెడితే ఈమె ప్రముఖ డైరెక్టర్ కృష్ణ వంశీ(Director Krishna Vamsi) ని పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే.
2003 వ సంవత్సరం లో వీళ్లిద్దరి వివాహం జరిగింది. వైవాహిక జీవితం లో 22 ఏళ్ళు పూర్తి చేసుకున్నప్పటికీ, ఇప్పటికీ వీళ్లిద్దరు విడివిడిగా ఉండడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసే విషయం. ఇలా రమ్య కృష్ణ చెన్నై లో, కృష్ణ వంశీ హైదరాబాద్ లో ఉండడం చూసి అందరూ వీళ్ళిద్దరూ విడిపోయారేమో అని అనుకుంటున్నారు. మీడియా లో దీనిపై పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. రమ్యకృష్ణ తన కొడుకు తో కలిసి చెన్నై కి వెళ్లిపోయిందని, కృష్ణ వంశీ తో విడిపోయినప్పటికీ కూడా అతనితో స్నేహంగానే ఉందని సోషల్ మీడియా లో వినిపించిన వార్త. వీళ్లిద్దరు కలిసి రీసెంట్ గానే ‘రంగమార్తాండ’ అనే సినిమాకి కూడా పనిచేసారు. అయినప్పటికీ కూడా వీళ్ళు విడిపోయారు అనే వార్తలకు అడ్డుకట్ట పడలేదు. కృష్ణ వంశీ ఎన్నో సార్లు అందులో ఎలాంటి నిజం లేదు అని చెప్పుకొచ్చినా విడాకుల వార్త ఆగలేదు.
దీంతో కృష్ణ వంశీ మరోసారి గట్టిగా ఈ విషయం పై స్పందించాల్సి వచ్చింది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ ‘ఈ అంశంపై నేను అనేక సందర్భాల్లో మాట్లాడాను, ఇందులో ఎలాంటి నిజం లేదని చెప్పాను. కానీ ఎవ్వరూ నమ్మడం లేదు. రమ్యకృష్ణ, నేను కలిసే ఉంటున్నాం. మేమిద్దరం రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటాం. ఎక్కడికైనా వేడుకలకు వెళ్ళేటప్పుడు మేము కలిసే వెళ్తాము. మేమిద్దరం కలిసి ఉన్న ఫోటోలు మీడియా కి మేము విడుదల చేయకపోవడం వల్ల మా మధ్య ఎదో జరిగిపోయిందని అనుకుంటున్నారు. మేము కలిసి ఎన్నో వందల ఫోటోలు దిగాము. కానీ వాటిని సోషల్ మీడియా లో పెట్టిజుకోవడానికి మేము ఇష్టపడము. అది మా వ్యక్తిగత వ్యవహారం కాబట్టి. తానూ సినిమా షూటింగ్స్ వల్ల ఎక్కువగా చెన్నై లో ఉంటుంది. నేను హైదరాబాద్ లో ఉంటున్నాను, రమ్య కృష్ణ వ్యక్తిగత జీవితాన్ని, ప్రొఫెషనల్ జీవితాన్ని చాలా చక్కగా బ్యాలన్స్ చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు కృష్ణ వంశీ.
Also Read : బాహుబలి సినిమా కోసం రమ్యకృష్ణ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?