Mazaka Collection
Mazaka Collection: యంగ్ హీరో సందీవ్ కిషన్ సక్సెస్ కోసం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నారు. ఆశించిన ఫలితం మాత్రం దక్కడం లేదు. మూడు పదులకు పైగా సినిమాలు చేసిన సందీప్ కిషన్ ఖాతాలో పట్టుమని ఓ ఐదు హిట్స్ లేవు. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. గత చిత్రం ఊరు పేరు భైరవకోన పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా, కమర్షియల్ గా ఆడలేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఫార్మ్ లో ఉన్న దర్శకుడిని ఎంచుకున్నాడు.
Also Read: అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్న సినిమా రజినీకాంత్ సూపర్ హిట్ సినిమాకి రీమేక్ గా రాబోతోందా..?
ధమాకా మూవీతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న త్రినాథరావు నక్కినతో మజాకా చేశాడు. ఈ మూవీ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న విడుదలైంది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. పర్లేదు, అక్కడక్కడా నవ్వించే కామెడీ ఉంది. ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో కనీసం రూ. 1-1.5 కోట్ల ఫస్ట్ డే షేర్ వస్తుందని అంచనా వేశారు. అయితే మజాకా సినిమాకు ప్రేక్షకుల నుండి స్పందన దక్కలేదు. ఏపీ/తెలంగాణలలో కలిపి ఫస్ట్ డే మజాకా రూ. 80 లక్షల షేర్ రాబట్టినట్లు సమాచారం. ఇది ఇంకా తక్కువగా కూడా ఉండొచ్చని అంటున్నారు.
మజాకా సినిమాపై ఒకింత బజ్ ఏర్పడడంతో రూ. 10 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓపెనింగ్స్ చూస్తే రికవరీ కష్టమే అనిపిస్తుంది. కనీసం రూ. 11 కోట్ల షేర్ రాబడితే కానీ మజాకా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఈ సినిమాకు లాంగ్ వీకెండ్ ఉంది. శని, ఆదివారాల్లో పుంజుకుంటే ఒకింత మెరుగైన వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. లేదంటే నిర్మాతలకు నష్టాలు తప్పవు.
మజాకా మూవీలో సందీప్ కిషన్ కి జంటగా రీతూ వర్మ నటించింది. రావు రమేష్ మరో ప్రధాన పాత్ర చేశాడు. ఒకే కుటుంబానికి చెందిన అమ్మాయిలను ప్రేమించే తండ్రి కొడుకులుగా రావు రమేష్, సందీప్ కిషన్ నటించారు. మజాకా చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చాడు. పలువురు స్టార్ క్యాస్ట్ మజాకా చిత్రంలో భాగం అయ్యారు. మరోవైపు డబ్బింగ్ మూవీ డ్రాగన్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. తెలుగు ఆడియన్స్ ఆ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు.
Also Read: 500 కోట్ల మార్క్ ను టచ్ చేయబోతున్న ఛావా…తెలుగు వర్షన్ అందుబాటులోకి వచ్చేది అప్పుడేనా..?