Vallabhaneni Vamsi (3)
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ పై( Vallabhaneni Vamsi) కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గన్నవరం టిడిపి కార్యాలయం పై జరిగిన దాడి కేసులో వంశీని అరెస్టు చేయాలని భావించారు పోలీసులు. అయితే కోర్టు ఆదేశాలు ఉండడంతో రూటు మార్చారు. టిడిపి కార్యాలయం లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్య వర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించారంటూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరు పరిచారు. కోర్టు 14 రోజులపాటు ఆయనకు రిమాండ్ విధించింది. విజయవాడ సబ్ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు వరుసగా వల్లభనేని వంశీ పై అదనంగా కేసులు నమోదవుతుండడం సంచలంగా మారుతోంది. ఇప్పట్లో ఆయన జైలు నుంచి బయటపడే అవకాశం లేదని తెలుస్తోంది.
Also Read: ఆ బూతులే పోసాని అరెస్ట్ కు కారణమయ్యాయా? కూటమి కక్షగట్టి లోపలేసిందా?
* ఒక్కో ఆధారం సేకరించే పనిలో
ప్రధానంగా గన్నవరం( Gannavaram) టిడిపి కార్యాలయం పై జరిగిన దాడికి సంబంధించి విచారణ జరుగుతోంది. అందులో కీలక ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. వంశీ కేంద్రంగా జరిగిన కుట్ర, ఇందులో జగన్మోహన్ రెడ్డికి లింకు ఉందా? లేదా? వంటి ఎన్నో అంశాలను పోలీసులు తవ్వుతున్నారు. గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసులో ఏ 71 గా ఉన్నారు వల్లభనేని వంశీ. అయితే ఈ కేసులో ఫిర్యాదుదారుడుగా ఉన్న ఎస్సీ యువకుడు సత్య వర్ధన్ ను కిడ్నాప్ చేయించారన్న ఫిర్యాదుతో వల్లభనేని వంశీ అరెస్టు అయ్యారు. ఈ తాజా కేసులో వంశీ ఏ 1 నిందితుడిగా చేర్చారు. ఆయన అనుచరులు కూడా అరెస్టు అయ్యారు. మరోవైపు కబ్జాలతో పాటు బెదిరింపులకు సంబంధించి వల్లభనేని వంశీ పై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి.
* సంచలన విషయం వెలుగులోకి..
అయితే తాజాగా విచారణ చేపడుతున్న పోలీసులకు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నట్లు సమాచారం. వంశీ చెబుతున్న మాటలు చూస్తే ఇందులో జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ కేసులో చేరుస్తారా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఈనెల 12న సత్య వర్ధన్ కిడ్నాప్ తర్వాత హైదరాబాదు నుండి వచ్చిన వల్లభనేని వంశీ తాడేపల్లి వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. అయితే ఈ విషయాన్ని ఒప్పుకొని వల్లభనేని వంశీ.. ఆధారాలు చూపించేసరికి ఒప్పుకున్నట్లు సమాచారం.
* ఈరోజు కస్టడీలో కీలక విచారణ
సత్య వర్ధన్ ( satyavardhan) కిడ్నాప్ తర్వాత వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలిసినట్టు? అసలు వారిద్దరి మధ్య ఏం చర్చలు జరిగినట్టు? ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా? అన్న కోణాల్లో పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈరోజు మూడో రోజు కస్టడీలో వంశీని పోలీసులు ఈ అంశాలపైనే ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. చిన్నపాటి ఆధారం దొరికిన జగన్మోహన్ రెడ్డి ఇరుకున పడినట్లే. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: జీవి రెడ్డి ఎపిసోడ్ కు పోసాని అరెస్టుతో చెక్