Uday Kiran done by star heroes : సినిమా ఇండస్ట్రీ లో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ మంచి గుర్తింపు అయితే ఉంటుంది. వాళ్ళు సాధించిన విజయాలు వారిని గొప్ప స్థాయికి తీసుకెళ్తుంటే మరి కొంతమంది హీరోలు సాధించిన డిజాస్టర్లు వాళ్లను అంతకంతకు దిగజారుస్తూ ఉంటాయి… ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లిన వారే కావడం విశేషం…
ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుసగా మూడు సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించి స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ఉదయ్ కిరణ్ (Uday kiran) ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపుని తీసుకొచ్చినవే కావడం విశేషం…ఆయన ఒకానొక సమయంలో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ల కంటే కూడా ముందు వరుసలో ఉండి మంచి సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లాడు. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని అనివార్య కారణాలవల్ల ఆయన అనుకోకుండా సూసైడ్ చేసుకుని చనిపోయిన విషయం మనకు తెలిసిందే. నిజానికి ఉదయ్ కిరణ్ చేయాల్సిన రెండు సినిమాలని ఇద్దరు హీరోలు చేసి స్టార్ హీరోలుగా మారారనే షయం మనలో చాలామందికి తెలియదు… త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన అతడు (Athadu) సినిమాని మొదట ఉదయ్ కిరణ్ తో చేయాలని అనుకున్నారట. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమాను మహేష్ బాబుతో చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఉదయ్ కిరణ్ మాత్రం ఒక మంచి సక్సెస్ ఫుల్ సినిమాని కోల్పోయాడనే చెప్పాలి. పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు సైతం ఉదయ్ కిరణ్ తో దేశముదురు (Deshamuduru) సినిమాని తెరకెక్కించాలని అనుకున్నాడు. కానీ ఆయన్ని తప్పించి ఆ సినిమాలో అల్లు అర్జున్ ను పెట్టుకొని ఆయనతో ఆ సినిమాని చేయాల్సి వచ్చింది.
Also Read : అప్పట్లో పవన్ టైటిల్ తో ఉదయ్ కిరణ్ సినిమా..ఇండస్ట్రీ హిట్ చేజారిపోయింది!
మరి ఏది ఏమైనా కూడా ఈ రెండు సినిమాల వల్ల మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇద్దరూ స్టార్ హీరోలుగా మారితే ఈ రెండు సినిమాలను మిస్ చేసుకున్న ఉదయ్ కిరణ్ మాత్రం భారీగా డీలా పడిపోయాడు… ఇక ఆ తర్వాత కాలంలో ఆయన డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకొని చనిపోయిన విషయం మనకు తెలిసిందే.
ఆయన అప్పుడు అలాంటి నిర్ణయం తీసుకొని ఉండకపోతే ఇప్పుడు ఆయనకు మంచి అవకాశాలు వచ్చి ఉండేవని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ భారీగా విస్తరించింది.
దానికి తోడుగా ఓటిటి ప్లాట్ఫారం కూడా చాలా బాగా స్ట్రాంగ్ అయింది. మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఇప్పుడు కనక ఉండి ఉంటే మంచి అవకాశాలు రావడమే కాకుండా మంచి సక్సెస్ లను కూడా సాధించేవాడు అని అతని అభిమానులు కూడా కోరుకుంటు ఉండటం విశేషం…