Hari Hara Veeramallu vs Ghati : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానటువంటి గొప్ప రికార్డులను సైతం క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు అందులో పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) ఒకరు. ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకు గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉండటం వల్ల సినిమాలను ఎక్కువగా చేయలేకపోతున్నాడు. అయినప్పటికి తన అభిమానుల ఆనందం కొరకు అప్పుడప్పుడు సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం. ప్రస్తుతం ఆయన ‘హరిహర వీరమల్లు’ (HariHara Veeramallu) అనే సినిమా చేశాడు. ఈ సినిమా జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను చేపట్టారు. అయితే ఈ సినిమాకి మొదట క్రిష్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. సినిమా రోజు రోజుకి లేటవుతుండటం వల్ల ఆయన ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇక అప్పుడు వేరే దారి లేక ఏ ఎం రత్నం కొడుకు అయిన జ్యోతి కృష్ణ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించాడు. ఇక క్రిష్(Krish)డైరెక్షన్ లో అనుష్క మెయిన్ లీడ్ లో వస్తున్న ఘాటీ(Ghati) సినిమా కూడా జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక నెల వ్యవధిలోనే వస్తున్న ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తోంది అనే విషయం మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. రెండు సినిమాలకి కూడా క్రిష్ దర్శకుడిగా వ్యవహరించడం అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకత్తిస్తుంది.
Also Read : కన్నీళ్లు పెట్టుకున్న ‘హరి హర వీరమల్లు’ నిర్మాత..అందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కారణమా?
ముఖ్యంగా క్రిష్ లాంటి స్టార్ డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అందులో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉంటుంది అని ఆ సినిమా కోసం ఎదురుచూసే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఇటు ఘాటి అటు హరిహర వీరమల్లు రెండింటి మధ్యలో ఆయన ఏ సినిమా సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
ఒకరకంగా హరిహర వీరమల్లు సినిమాకి సగాని కంటే ఎక్కువ దర్శకత్వ భాద్యతలను స్వీకరించింది క్రిష్ గారే కావడం విశేషం…ఆయన చేస్తున్న ఘాటి సినిమా మాత్రం తన ఓన్ డైరెక్షన్ లో వస్తుంది. కాబట్టి ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని ఆయన కోరుకుంతున్నట్టుగా తెలుస్తోంది. ఇక నెల గ్యాప్ లోనే రెండు సినిమాలు రావడం అందులో క్రిష్ కీలక బాధ్యతలను పోషించడం అనేది ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది…