Uday Kiran: ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, మొదటి మూడు సినిమాలతోనే హ్యాట్రిక్ హిట్స్ ని అందుకొని స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టిన అతి తక్కువమంది హీరోలలో ఒకరు ఉదయ్ కిరణ్(Uday Kiran). ఆ తర్వాత జరిగిన ఎన్నో పరిణామాల కారణంగా ఉదయ్ కిరణ్ తన కెరీర్ మొత్తాన్ని సర్వనాశనం చేసుకున్న సంగతి తెలిసిందే. చివరికి ఎలాంటి అవకాశాలు లేక, భార్య సంపాదన తో బ్రతకలేక, అవకాశాల కోసం ఎదురు చూసి అవి దక్కకపోవడంతో మనస్తాపానికి గురై అఘాయిత్యం చేసుకున్న ఘటన ఎప్పటికీ మరచిపోలేము. ఉదయ్ కిరణ్ అనే పేరు వింటే కన్నీళ్లు ఆపుకోలేని పరిస్థితి. మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు, ఇప్పుడు ఆయన బ్రతికి ఉండుంటే మళ్ళీ జీవితంలో పైకి రావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, తొందరపడి చాలా పెద్ద తప్పు చేసాడు అని అందరు అంటున్నారు.
Also Read: ఎంపురాన్’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..300 కోట్లకు అతి చేరువలో!
ఇదంతా పక్కన పెడితే అప్పట్లో ఉదయ్ కిరణ్ కి కొన్ని అనుకోని కారణాల వల్ల షూటింగ్ ప్రారంభమై సగానికి పైగా పూర్తి అయినా సినిమాలు కూడా మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అలా అప్పట్లో AM రత్నం(AM Ratnam) నిర్మాణ సారథ్యంలో ఉదయ్ కిరణ్ సినిమా 80 శాతానికి పైగా పూర్తి అయినప్పటికీ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని ప్రముఖ సంగీత దర్శకుడు జోస్య భట్ల చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సూపర్ హిట్ చిత్రం ‘ఖుషి’ లోని ‘ప్రేమంటే సులువు కాదురా’ అనే పాట మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ పాట పల్లవి నే మూవీ కి టైటిల్ గా పెట్టారు. అప్పట్లో ఈ చిత్రం పై అంచనాలు భారీగానే ఉండేవి. మంచి అద్భుతమైన స్టోరీ అని, విడుదల అయ్యుంటే ఉదయ్ కిరణ్ కెరీర్ ని ఒక మలుపు తిప్పి ఉండేదని, AM రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ సినిమాని పూర్తి చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశాడని, కానీ సఫలం కాలేకపోయాడని చెప్పుకొచ్చాడు.
సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలియదు కానీ, ఎదో బలమైన కారణం ఉంది అనే అనుమానాన్ని వ్యక్తం చేసాడు జోస్య భట్ల. ఇదంతా పక్కన పెడితే ఉదయ్ కిరణ్ అలా అఘాయిత్యం చేసుకోవాల్సింది కాదని ఇప్పటికీ ఆయన్ని తప్పు బట్టే వాళ్ళు ఉన్నారు. ఉదయ్ కిరణ్ లాగానే హీరో నితిన్ కూడా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకొని, కెరీర్ ముగిసిపోతుంది అని అనుకుంటున్న సమయంలో ‘ఇష్క్’ చిత్రం వచ్చిందని. ఈ సినిమా తర్వాత నితిన్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందుకొని మార్కెట్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గురింపుని తెచ్చుకున్నాడని, ఈ ఓటీటీ యుగం లో ఉదయ్ కిరణ్ బ్రతికి ఉండుంటే అదే విధంగా భారీ కం బ్యాక్ ఇచ్చే అవకాశం ఉండేదని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ఉదయ్ కిరణ్ చాలా తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.