Sekhar Kammula: శేఖర్ కమ్ముల మేకింగ్ ను కాపీ చేస్తున్న ఇద్దరు స్టార్ డైరెక్టర్లు…ఎందుకు అలా చేస్తున్నారు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక వైవిధ్యమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల... ఆయన చేసే సినిమాలు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తూ ఉంటాయి... అందుకే తను స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు...

Written By: Gopi, Updated On : October 28, 2024 10:52 am

Sekhar Kammula

Follow us on

Sekhar Kammula: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులకు సపరేట్ స్టైల్ ఉంటుంది. వాళ్ళు కమర్షియల్ సినిమాలను చేయకుండా డిఫరెంట్ స్టైల్లో సినిమాలను తెరకెక్కిస్తూ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. ఇక అలాంటి కోవకు చెందినవారే శేఖర్ కమ్ముల ఆయన చేసిన ‘ఆనంద్ ‘ సినిమా నుంచి ఇప్పుడు చేస్తున్న ‘కుబేర ‘ సినిమా వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ ను ఎంచుకొని చాలా సెన్సిటివ్ ఇష్యూష్ తో సినిమాని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. అందువల్లే శేఖర్ కమ్ములకు ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపైతే ఉంది. ముఖ్యంగా ఆయనకి రైటర్ గా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు సాగుతుందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవడానికి ప్రస్తుతం కుబేర సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇక ధనుష్ ని హీరోగా తీసుకున్న ఈ సినిమాలో నాగార్జున కూడా ఒక కీలకపాత్రను నటిస్తూ ఉండడం విశేషం…ఇక ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఇప్పుడు ఆయన స్టైల్ ని కాపీ చేస్తూ ఇద్దరూ యంగ్ డైరెక్టర్లు స్టార్ డైరెక్టర్లు ఎదిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో ముఖ్యంగా తరుణ్ భాస్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. పెళ్లిచూపులు సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న తరుణ్ భాస్కర్ శేఖర్ కమ్ముల మేకింగ్ స్టైల్ ని కాపీ చేయడంలో మొదటి స్థానంలో ఉన్నాడు.

ఇక ఆయన రాసినట్టుగానే చాలా సెన్సిటివ్ ఇష్యూస్ తో సినిమా కథలను రాస్తూ ప్రతి డైలాగు కూడా కమ్ముల గారి స్టైల్ లోనే చెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఉన్న వాళ్లలో తరుణ్ భాస్కర్ బెస్ట్ స్క్రీన్ రైటర్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు అంటే అది శేఖర్ కమ్ముల గారి ఇన్ఫ్లుయెన్స్ తోనే అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

ఇక ఇదిలా ఉంటే వివేక్ ఆత్రేయ కూడా శేఖర్ కమ్ముల స్టైల్ ని కాపీ చేస్తున్నాడు. తన మొదటి సినిమా నుంచి మొన్న వచ్చిన ‘సరిపోదా శనివారం’ సినిమా వరకు ప్రతి సినిమాలో కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ను శేఖర్ కమ్ముల అయితే ఎలా డీల్ చేస్తాడో తను కూడా అలానే డీల్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇతను కూడా చాలా మంచి స్క్రీన్ రైటర్ గా పేరు సంపాదించుకోవడంలో శేఖర్ కమ్ముల పాత్ర అయితే చాలా వరకు ఉందని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…