Money Been Deducted: ప్రస్తుత కాలంలో డబ్బు లేనిది ఏ పని ముందుకు సాగదు. ఉదయం లేచిందగ్గర్నుంచి రాత్రి వరకు ఏదో ఒక ఖర్చుకు డబ్బు అవసరం తప్పకుండా ఉంటుంది. అందుకే చాలా చాలా మంది డబ్బు సంపాదించడానికి తాపత్రయపడుతూ ఉంటారు. అయితే ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఎవరైనా ఊరికే తీసుకుంటే ఊరుకుంటారా? ఎవరూ ఒప్పుకోరు. అప్పటి వరకు పడిన కష్టమంతా వేస్ట్ అవుతుంటే ఎవరికైనా ఆందోళనకరంగా ఉంటుంది. అందుకే బ్యాంకు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ప్రస్తుత కాలంలో హ్యాకర్ల బెడద ఎక్కువైంది. ఏ చిన్న అవకాశం దొరికిగా బ్యాంకు డిటేయిల్స్ తెలుసుకొని డబ్బును కాజేస్తున్నాురు. అయితే ఒక్కోసారి జాగ్రత్తగా ఉండి.. ఎటువంటి ఓటీపీలు చెప్పకపోయినా.. ఎలాంటి లింక్ లు ప్రెష్ చేయకపోయినా.. అకౌంట్ నుండి డబ్బు మాయం అవుతుంది. ఇలాంటి సమయంలో బ్యాంకును సంప్రదించాలి. అయినా వారు పట్టించుకోకపోతే ఏం చేయాలి?
బ్యాంకు వ్యవహారాల్లో రోజుకో కొత్త సంఘటనను చూస్తున్నాం. చాలా మంది హ్యాకర్లకు ఓటీపీలు చెప్పడం ద్వారా బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బును ఖాళీ చేస్తున్నారు. మరికొందరు కొన్ని లింకులు పంపించి నగదును దోచుకుంటున్నారు. ఇలా రోజుకో కొత్త రకం మోసంతో బ్యాంకు అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి ఎలాంటి ఓటీపీలు ఎవరికీ చెప్పకపోయినా.. ఎటువంటి లింక్ లు ప్రెష్ చేయకపోయినా డబ్బు కట్ అయినట్లు మెసేజ్ వస్తుంది. ఇలాంటి సమయంతో మూడు రోజుల లోపు కచ్చితంగా బ్యాంకును సంప్రదించాలి. తమ డబ్బు ఎలా మాయం అయిందో వివరాలు తెలియజేయమని చెప్పాలి.
ఈ సమయంలో బ్యాంకు అధికారులు డబ్బు ఎలా కట్ అయిందో చెక్ చేస్తారు. ఒకవేళ బ్యాంకు అధికారుల పొరపాటు అయితే వెంటనే కట్ అయిన డబ్బులు తిరిగి బ్యాంకులో వేస్తారు. కానీ కొన్ని బ్యాంకులు మాత్రం నిర్లక్ష్యంగా ఉంటాయి. కస్టమర్ల గోడును పట్టించుకోరు. ఈ సమయంలో గనుక బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే వెంటనే బ్యాంకు అంబుడ్స్ మెన్ కు ఫిర్యాదు చేయొచ్చు. ఎందుకంటే బ్యాంకు రూల్స్ ప్రకారం బ్యాంకు ఖాతాదారుడు ఎటువంటి పొరపాటు చేయకుండా డబ్బులు కట్ అయితే ఆ డబ్బును తిరిగి బ్యాంకు వారే చెల్లించాల్సి ఉంటుంది.
నేటి కాలంలో డబ్బు సంపాదించడం కష్టంగా మారుతుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పోటీ పెరగడంతో నిరుద్యోగం పెరిగిపోయింది. దీంతో కొందరు ఎలాంటి కష్టం చేయకుండా డబ్బు సంపాదించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కొందరు టెక్నాలజీని ఉపయోగించి హ్యాకింగ్ కు పాల్పడుతున్నారు. అయితే బ్యాంకు మోసాలపై కొందరు అవగాహన ఉండి జాగ్రత్తలు పాటిస్తున్నారు. అయితే ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. కొందరు హ్యాకర్ల బారిన పడకుండా బ్యాంకులు చేసే పొరపాట్లతో డబ్బులు కట్ అయ్యే అవకాశం ఉంది. అందువల ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వెంటనే ఆందోళన చెందకుండా బ్యాంకు అధికారులను సంప్రదించాలి. బ్యాంకు వ్యవహారాలు ఎప్పుడూ బిజీగా ఉంటాయి. ఈ క్రమంలో పొరపాట్లు జరగడం సహజం. అయితే ఖాతాదారులతో సంయమనం పాటించడం వల్ల బ్యాంకుకు మంచి పేరు వస్తుంది. • Scanned by