https://oktelugu.com/

Vettaiyan: రజినీకాంత్ వేట్టయన్ సినిమాలో చిరంజీవి ఒక పాత్ర చేయాల్సింది…ఎందుకు చేయలేదంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వాళ్లు ఇప్పటికీ స్టార్ హీరోలుగా ఉండడం విశేషం... ఇక రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి నటులు వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తూ తమిళ్ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు... అందుకే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథలు వస్తున్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : October 28, 2024 / 10:46 AM IST

    Vettaiyan(1)

    Follow us on

    Vettaiyan: తమిళ్ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్… ఆయన నటించిన వేట్టయన్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. నిజానికి ఈ సినిమాలో రజనీకాంత్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం అయితే ఉంది. అమితాబచ్చన్, రానా లాంటి దిగ్గజ నటులు కూడా ఈ సినిమాలో నటించడం విశేషం…అయితే ఈ సినిమాలో ఒక పాత్ర కోసం చిరంజీవిని అడిగారట. కానీ ఆయన ఆ పాత్ర చేయలేదు. చిరంజీవి ఆ పాత్రలో ఎందుకు నటించలేకపోయాడు అనేదానిమీద ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలైతే జరుగుతున్నాయి. నిజానికి ఈ సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రలో చిరంజీవి చేత నటింపజేయాలని రజనీకాంత్ అనుకున్నారట. కానీ సినిమా మొత్తాన్ని చూసిన తర్వాత అదొక ఫ్లోలో ఉందని చిరంజీవి చిన్న గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చినా కూడా అందులో ఇమడలేదనే ఉద్దేశ్యంతోనే రజనీకాంత్ మళ్లీ చిరంజీవిని వద్దని చెప్పినట్టుగా తెలుస్తోంది. లేకపోతే చిరంజీవి కూడా ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో నటించి మెప్పించేవాడు. అయితే చిరంజీవి తన ఎంటైర్ కెరియర్ లో చాలామంది హీరోల సినిమాల్లో గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చాడు.

    అయినప్పటికీ తన క్యారెక్టర్ నచ్చి అందులో ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటే తను ఐదు నుంచి పది నిమిషాల క్యారెక్టర్ ని కూడా పోషించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా రజనీకాంత్ చిరంజీవి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి కూడా ఇప్పటివరకు చాలా మంచి మిత్రులుగా కొనసాగడం విశేషం…

    ఇక వేట్టయన్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. కాబట్టి తన తదుపరి లోకేష్ కనకరాజ్ తో చేస్తున్న కూలీ సినిమా మీద రజనీకాంత్ ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను బ్రేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని అటు లోకేష్ కనకరాజ్,ఇటు రజనీకాంత్ ఇద్దరు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారట.

    ఇక ఇప్పటికే లోకేష్ కనకరాజు విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కి భారీ సక్సెస్ ని అందించాడు. ఇక రజనీకాంత్ కి కూడా అదే రీతిలో భారీ సక్సెస్ ని అందిస్తాడనే ఉద్దేశ్యంలో రజనీకాంత్ అభిమానులైతే ఉన్నారు…