Trivikram and Venkatesh : తెలుగు లో ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే అలవోకగా నటించి మెప్పించగలిగే కెపాసిటీ ఉన్న నటులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో వెంకటేష్ (Venkatesh) ఒకరు… ఒకప్పుడు ఆయన నుంచి ఒక సినిమా వచ్చిందంటే చాలు ఫ్యామిలీ ఆడియాన్స్ మొత్తం సినిమా థియేటర్ కి వెళ్లి హ్యాపీగా సినిమాను చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఆయన మల్టీ స్టారర్ సినిమాలను చేస్తూనే సోలో హీరోగా కూడా సినిమాలను చేస్తూ సీనియర్ హీరోల్లో ఎవరికీ దక్కని రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టి వెంకటేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే సీనియర్ హీరోలెవ్వరికి లేనటువంటి ఒక అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక త్రివిక్రమ్ (Trivikram) లాంటి దర్శకుడు సైతం కెరియర్ మొదట్లో రైటర్ గా తన సత్తా చాటుకుంటూ వచ్చాడు. ఆయన రైటర్ గా చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి సినిమాలు అతనికి రైటర్ గా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. అయితే ఈ రెండు సినిమాల్లో కూడా వెంకటేష్ హీరో కావడం విశేషం…త్రివిక్రమ్ కామెడీ పంచులకు వెంకటేష్ టైమింగ్ అద్భుతంగా ఉంటుందని అందువల్లే వీళ్ళ కాంబినేషన్ కి మంచి గుర్తింపైతే వచ్చిందని చాలామంది సినిమా మేధావులు చెబుతూ ఉంటారు. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో మాత్రం వెంకటేష్ ఒక్క సినిమా కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్లో ఒక సినిమా అయితే వస్తుంది అంటూ ఫిలింనగర్ సర్కిల్లో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే వీళ్ళిద్దరూ స్క్రిప్ట్ డిస్కషన్ లో ఉన్నట్టుగా కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. నిజానికి త్రివిక్రమ్ అన్ని సెట్ అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సింది. కానీ త్రివిక్రమ్ కి పాన్ ఇండియా మార్కెట్ లేకపోవడం వల్ల అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.
Also Read : అల్లు అర్జున్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇవ్వడం అతని అభిమానులను ఇబ్బంది పెడుతుందా..?
కాబట్టి ఆ తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ తో సినిమా చేస్తే ఎఫెక్టివ్ గా ఉంటుందని తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) తో సినిమాకి కమిట్ అయ్యాడు. దాంతో ప్రస్తుతం త్రివిక్రమ్ కి ఏ స్టార్ హీరో కూడా డేట్స్ ఇచ్చే అవకాశాలైతే లేవు. అందువల్లే వెంకటేష్ తో ఒక సినిమా చేసి మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమాతో త్రివిక్రమ్ ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు తద్వారా ఆయనకంటూ ఒక భారీ మార్కెట్ క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి (Menakshi Choudary)ని తీసుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
రీసెంట్ గా వెంకటేష్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇక గురూజీ త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘గుంటూరు కారం’ (Gunturu Karam) సినిమాలో కూడా ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించింది. త్రివిక్రమ్, వెంకటేష్ కి ఆమెతో మంచి ర్యాపో ఉండడం వల్ల తననే ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని ఇద్దరు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
Also Read : వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో ‘నువ్వు నాకు నచ్చావ్ 2’ చేయబోతున్నారా..?