Mohanlal : మలయాళం సినీ ఇండస్ట్రీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే అతి చిన్న ఇండస్ట్రీ, కనీసం పది కోట్ల గ్రాస్ ఓపెనింగ్ కూడా ఇవ్వని ఇండస్ట్రీ అని అందరు అంటూ ఉండేవారు. అది వాస్తవమే, ఈ ఇండస్ట్రీ నుండి ఒక సినిమా సూపర్ హిట్ అయ్యి వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటే ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో చూస్తుంటారు ట్రేడ్ పండితులు. అలాంటి ఇండస్ట్రీ ని అక్కడి సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) ఎక్కడికో తీసుకెళ్లి పెట్టాడు. వంద కోట్ల గ్రాస్ అంటే ఏంటో తెలియని మలయాళం సినీ ఇండస్ట్రీ కి మొట్టమొదటి వంద కోట్ల గ్రాస్ సినిమాని అందించిన సూపర్ స్టార్ ఆయన. ఇప్పుడు అతి త్వరలోనే కేరళ రాష్ట్రం నుండి వంద కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన మొట్టమొదటి హీరో గా కూడా మోహన్ లాల్ చరిత్రకు ఎక్కనున్నాడు.
Also Read : నా సినిమాతో పోలికనా?’..చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ పై మోహన్ లాల్ రియాక్షన్!
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘తుడరం'(Thudaram Movie) కేరళ రాష్ట్రం నుండి 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ తో కచ్చితంగా వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకోనుంది ఈ చిత్రం. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 13 రోజుల్లో 180 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. నెల రోజుల క్రితమే ఆయన హీరో గా నటించిన ‘L2: ఎంపురాన్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై 270 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అతి త్వరలోనే ‘తుడరం’ చిత్రం 250 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని దాటనుంది. అదే కనుక జరిగితే నెల రోజుల గ్యాప్ లో మలయాళం ఫిలిం ఇండస్ట్రీ కి 500 కోట్ల రూపాయిల బిజినెస్ ని చూపించిన ఏకైక హీరో గా మోహన్ లాల్ చరిత్రకు ఎక్కబోతున్నాడు.
వాస్తవానికి ‘L2: ఎంపురాన్’ కి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. కానీ ఆ సినిమాకు మొదటి నుండి మంచి హైప్ ఉండడం తో ఓపెనింగ్ తోనే దాదాపుగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. ఆ తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా టాక్ తో సంబంధం లేకుండా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. ఈ సినిమాకు ‘తుడరం’ కి వచ్చిన రేంజ్ లో పాజిటివ్ టాక్ వచ్చి ఉండుంటే కేవలం ఆ ఒక్క సినిమానే 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రస్తుతం మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ లో మోహన్ లాల్ కి పోటీ ని ఇచ్చే మరో హీరో లేకపోవడం గమనార్హం. తన తోటి హీరో మమ్మూటి ఈ రేస్ లో చాలా వెనుకబడ్డాడు అనే చెప్పాలి.
Also Read : ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీనే నెంబర్ 1 : మోహన్ లాల్