Game Changer : థియేటర్స్ లో డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన కొన్ని సినిమాలు ఓటీటీ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకోవడం వంటివి మనం ఇది వరకు చాలా సార్లు చూసాము. ఇప్పుడు రామ్ చరణ్(Global Star Ram Charan) ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రం కూడా ఆ జాబితాలోకి చేరిపోయింది. శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. ఇలాంటి అవుట్ డేటెడ్ సినిమా కోసం రామ్ చరణ్ లాంటి హీరో మూడేళ్ళ సమయాన్ని వృధా చేశాడా అంటూ అభిమానులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇది కేవలం రామ్ చరణ్ స్టార్ పవర్ కారణంగానే జరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read : ‘గేమ్ చేంజర్’ టాప్..’సంక్రాంతికి వస్తున్నాం’ అవుట్..ఓటీటీలో విచిత్రమైన ఫలితాలు!
అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ హిందీ మినహా, మిగిలిన అన్ని భాషలకు కలిపి అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. కానీ హిందీ వెర్షన్ ని మాత్రం నిర్మాత దిల్ రాజు ‘జీ5’ సంస్థకు అమ్మాడు. మార్చి నెలలో స్ట్రీమింగ్ మొదలైన ఈ చిత్రం ఇప్పటికీ ట్రెండింగ్ అవుతూనే ఉంది. ఈమధ్య కాలంలో ఎన్నో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. అన్ని రెండు వారాలకు మించి ట్రెండ్ అవ్వలేదు. కానీ గేమ్ చేంజర్ చిత్రం దాదాపుగా 8 వారాల నుండి ట్రెండ్ అవుతూనే ఉంది. ఆ సంస్థ అందించే లెక్కల ప్రకారం చూస్తే ఇప్పటి వరకు ఈ చిత్రానికి 500 మిలియన్ కి పైగా వాచ్ మినిట్స్ వచ్చాయట. ఒక ఫ్లాప్ సినిమాకు ఈ రేంజ్ వ్యూస్ రావడం చరిత్రలో ఇదే తొలిసారిగా పరిగణించొచ్చు.
దీనిని బట్టి నార్త్ ఇండియా లో రామ్ చరణ్ కి ఎలాంటి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి హిందీ లో ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ, ఫుల్ రన్ లో దాదాపుగా 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. భవిష్యత్తులో ‘పెద్ది’ సినిమా హిట్ అయితే రామ్ చరణ్ నార్త్ ఇండియన్ మార్కెట్ ని రూల్ చేస్తాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రీసెంట్ గానే విడుదలైన ‘పెద్ది’ మూవీ గ్లింప్స్ వీడియో కి దేశవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా IPL టీమ్స్ ‘పెద్ది’ సిగ్నేచర్ షాట్ ని ఒక రేంజ్ లో వాడేస్తున్నారు. రీసెంట్ గా ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఏకంగా పెద్ది గ్లింప్స్ ని రీ క్రియేట్ చేస్తూ ఒక వీడియో ని అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా విడుదలకు ముందే ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా, విడుదల తర్వాత ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.
Also Read : హిట్ 3′ సూపర్ హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబట్టలో తెలుసా..? నాని కి అగ్నిపరీక్ష!