Homeఎంటర్టైన్మెంట్Trivikram Sunil Clash: ఆ మూవీ టైమ్ లో త్రివిక్రమ్ - సునీల్ మధ్య విబేధాలు...

Trivikram Sunil Clash: ఆ మూవీ టైమ్ లో త్రివిక్రమ్ – సునీల్ మధ్య విబేధాలు వచ్చాయి… అందుకే గురూజీ అలా చేశాడు…

Trivikram Sunil Clash: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందంటే సగటు ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుంది. ఆ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ దొరుకుతుంది. ముఖ్యంగా చిన్నవాళ్ల దగ్గరి నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే అంశాలు అందులో పుష్కలంగా ఉంటాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు దాదాపు సక్సెస్ ఫుల్ గానే నిలిచాయి అంటే దానికి కారణం ఆయన రాసే మాటలు అలాగే తెర మీద చూపించే క్యారెక్టరైజేషన్ అన్నీ […]

Trivikram Sunil Clash: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందంటే సగటు ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుంది. ఆ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ దొరుకుతుంది. ముఖ్యంగా చిన్నవాళ్ల దగ్గరి నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే అంశాలు అందులో పుష్కలంగా ఉంటాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు దాదాపు సక్సెస్ ఫుల్ గానే నిలిచాయి అంటే దానికి కారణం ఆయన రాసే మాటలు అలాగే తెర మీద చూపించే క్యారెక్టరైజేషన్ అన్నీ కూడా ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. అందువల్లే ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో తన మనుగడను కొనసాగించగలుగుతున్నాడు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సునీల్ త్రివిక్రమ్ ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉండే వారంటూ గతంలో పలు సందర్భాల్లో తెలియజేశారు. ఇక సునీల్ నటుడుగా రాణిస్తుంటే త్రివిక్రమ్ మాత్ర టాప్ డైరెక్టర్ గా తన సత్తా చాటుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న ఖలేజా సినిమా సమయంలో సునీల్ కి త్రివిక్రమ్ కి మధ్య చిన్న క్లాసెష్ అయితే వచ్చాయట. దానికి కారణం ఏంటి అంటే ఈ సినిమాని 2008లో స్టార్ట్ చేశారు.

మధ్యలో కొన్ని రోజుల పాటు షూటింగ్ జరపకపోవడంతో రావడంతో సినిమా రిలీజ్ లేటయ్యింది. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా ఇంట్రడక్షన్ లో రావు రమేష్ హీరో కోసం ఎలివేషన్స్ ఇస్తూ చెప్పే డైలాగులు సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడు రాజమౌళి మగధీర సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఈ క్రమంలోనే సునీల్ ఖలేజా సినిమా గురించి చెప్పి రావు రమేష్ అనే నటుడితో ఇలా హీరో ఎలివేషన్స్ ఇచ్చే డైలాగులు చెప్పిస్తున్నారని చెప్పాడట. దాంతో రాజమౌళి సైతం తన సినిమాలో అలాంటి డైలాగ్స్ ఉంటే బాగుంటుందని అనుకొని రావు రమేష్ ని తీసుకొని సేమ్ అలాంటి డైలాగులు చెప్పించాడట. మొత్తానికైతే ఖలేజా కంటే మగధీర ముందు రిలీజ్ అవ్వడంతో ఆ డైలాగులు హైలెట్ అయ్యాయి…

ఇక ఈ విషయం తెలుసుకున్న త్రివిక్రమ్ సునీల్ తో కొద్దిరోజుల పాటు మాట్లాడలేదనే వార్తలైతే అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇక ఏది ఏమైనా కూడా కెరియర్ స్టార్టింగ్ నుంచి వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కావడం వల్ల మరోసారి త్రివిక్రమ్ తన సినిమాల్లో సునీల్ కైతే అవకాశాలను ఇస్తున్నాడు… ఆ సీన్ గురించి నిజంగానే సునీల్ రాజమౌళికి చెప్పాడా? లేదా అనే దాంట్లో క్లారిటీ అయితే లేదు. కానీ త్రివిక్రమ్ మాత్రం సునీల్ వల్లే లీక్ అయిందని అనుకున్నాడట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper