Mahesh Babu-Ram Charan Multi Starrer Movie: దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) ఏ క్షణాన ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమా చేశాడు. కానీ అప్పటినుంచి ప్రతి దర్శకుడు మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుండడం విశేషం…ఇక స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేస్తే వాళ్ళ క్రేజ్ భారీగా పెరుగుతుందనే ఆలోచనతో ఉన్నారు. త్రిబుల్ ఆర్ (RRR) లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించడమే కాకుండా ఆ సినిమాకి ప్రాణం పోశారు. మొత్తానికైతే వాళ్ళ నటనతో సినిమాని నెక్స్ట్ లెవెల్ ల్లో నిలిపారు. రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతో సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చే విధంగా చేశారనే చెప్పాలి. ఇక ప్రస్తుతం మహేష్ బాబు (Mahesh Babu), రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్లో కూడా ఒక భారీ మల్టీ స్టారర్ సినిమాని తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో ఒక స్టార్ డైరెక్టర్ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న లోకేష్ కనకరాజు (Lokesh Kanakaraju) గా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన రజనీకాంత్ (Rajinikanth) తో కూలీ (Cooli ) అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా అయిపోయిన వెంటనే ఖైదీ 2 (Khaidi 2) సినిమా గాని లేదంటే విక్రమ్ 2 (Vikram 2) సినిమాని గాని స్టార్ట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ గ్యాప్ లోనే ఆయన రామ్ చరణ్ (Ram Charan), మహేష్ బాబు (Mahesh Babu) లకు ఒక కథను కూడా వినిపించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇక అండర్ వరల్డ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళిద్దరు ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? లేదా అనే విషయంలో సరైన క్లారిటీ లేదు. కానీ లోకేష్ మాత్రం వీళ్ళకి ఒక కథనైతే వినిపించాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇక కోలీవుడ్ మీడియాలో సైతం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ కొన్ని వార్తలను కూడా రాస్తున్నారు…
Also Read: Sukumar really liked that Balayya movie: బాలయ్య చేసిన ఆ సినిమా అంటే సుకుమార్ కి చాలా ఇష్టమట…
లోకేష్ కనకరాజు రజనీకాంత్ తో చేస్తున్న సినిమా సక్సెస్ ని సాధిస్తేనే ఆయన మార్కెట్ అనేది పదిలంగా ఉంటుంది. లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ భారీగా పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ సినిమా సక్సెస్ ని బట్టి ఈ మల్టీ స్టారర్ సినిమా ఉంటుందా? లేదా అనేది డిసైడ్ అవ్వబోతుంది అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…