Homeఆంధ్రప్రదేశ్‌Thalliki Vandanam Viral Song: నీకు 15 వేలు.. నీకు 18 వేలు.. వైసిపి మాస్...

Thalliki Vandanam Viral Song: నీకు 15 వేలు.. నీకు 18 వేలు.. వైసిపి మాస్ ర్యాగింగ్ కు బ్రేక్!

Thalliki Vandanam Viral Song: ఇప్పటివరకు వైసీపీ తల్లికి వందనం పథకం(Thalliki vandanam) విషయంలో ఒక ఆట ఆడుకుంది. వైసిపి ఆధ్వర్యంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా.. చిన్నపాటి వేడుక జరిగినా.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు అంటూ ఓ రేంజ్ లో విరుచుకుపడేది. డప్పులు కొడుతూ.. టిడిపి సీనియర్ నేత, మంత్రి నిమ్మల రామానాయుడు ను ఓ రేంజ్ లో ఆడుకునేది. అయితే ఇప్పుడు తల్లికి వందనం అమలు చేస్తున్న వేళ.. బాల్ ఇప్పుడు నిమ్మల రామానాయుడు కోర్టులో చేరనుంది. మరి ఇప్పుడు నిమ్మల రామానాయుడు అదే రేంజ్ లో విరుచుకు పడితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మొఖం ఎక్కడికి వెళ్తుంది అన్నది ప్రశ్న. 2024 ఎన్నికల హామీలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నగదు సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే విషయాన్ని చెప్పుకొచ్చారు నిమ్మల రామానాయుడు. పథకం అమలు కాకపోయేసరికి సామాన్య వైసీపీ కార్యకర్త నుంచి అధినేత జగన్మోహన్ రెడ్డి వరకు దీనిని గుర్తు చేస్తూ తెగ టీజ్ చేశారు.

Also Read: AP Minister : ఆరు ఎకరాల్లో 390 బస్తాల దిగుబడి.. ఆదర్శ రైతుగా ఆ ఏపీ మంత్రి!

ఎన్నికల్లో ప్రధాన హామీగా..
వాస్తవానికి తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) సంక్షేమం కంటే అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంది. ప్రజలకు ఉచిత సంక్షేమ పథకాలు అందించేందుకు చంద్రబాబు ఇష్టపడేవారు కాదు. కానీ 2019లో అదే సంక్షేమాన్ని హామీలుగా చూపిన వైసీపీ అధికారంలోకి వచ్చింది. అవే సంక్షేమ పథకాలను అమలు చేసి అధికారాన్ని పదిలం చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా గద్దె దించాలన్న కసితో టిడిపి, జనసేన,బిజెపి కూటమి కట్టాయి. సూపర్ సిక్స్ పథకాల పేరిట ఏపీ ప్రజలకు వరాలజల్లు కురిపించాయి. ఇవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ముఖ్యంగా నిమ్మల రామానాయుడు లాంటి నేతలు వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. ఈ నేపథ్యంలో నీకు 15 వేలు.. నీకు 15 వేలు అంటూ ఆయన లయబద్ధంగా చేసిన ప్రచారం నిజంగానే ఆకట్టుకుంది.

జగన్ సైతం అవహేళన
ఎన్నికల్లో కూటమి( Alliance) ఘనవిజయం సాధించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. అయితే దాని నుంచి బయటపడేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కంటే అమలు కాని సంక్షేమ పథకాలను ఎక్కువగా ప్రస్తావిస్తోంది. అందులో భాగంగా నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలను, ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా తిప్పి కొడుతోంది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి నీకు 15 వేలు, నీకు 15 వేలు అంటూ మరింతగా రెచ్చిపోయారు. ఇక వైసిపి శ్రేణులు అయితే ఎక్కడికక్కడే నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలను అవహేళన చేస్తూ.. తల్లికి వందనం ఎప్పుడు అంటూ నిలదీయడం మొదలుపెట్టారు. అయితే ఈ పథకం అమలు చేయకపోవడంతో నిమ్మల రామానాయుడు సైతం పెద్దగా పట్టించుకోలేదు. కానీ నిమ్మల రామానాయుడు పై వైసీపీ నేతల ర్యాగింగ్ మాత్రం ఆగలేదు.

Also Read: Y S Jagan Mohan Reddy: కూటమి’పై జగన్ ప్రతీకారం తప్పదా?

ఎక్కడైనా ఇదే ఆట, పాట
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ఏ కార్యక్రమమైనా నిర్వహించినా.. చిన్నపాటి సమావేశం ఏర్పాటు చేసిన.. నీకు 15 వేలు.. నీకు 15 వేలు అంటూ ఆటపాటలతో వైసిపి శ్రేణులు రెచ్చిపోయేవి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. హామీ ఇచ్చిన మాదిరిగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందించేందుకు సిద్ధపడుతోంది. మరి కొద్ది గంటల్లో ఈ పథకం అమలు అయ్యాక నిమ్మల రామానాయుడు ర్యాగింగ్ కు దిగితే.. జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్న.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular