Trivikram : సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) మొదటి రైటర్ గా తన కెరియర్ ను ప్రారంభించినప్పటికి ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తూ దర్శకుడిగా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు వెలుగొందుతున్నాడు. ఒకప్పుడు టాప్ 5 డైరెక్టర్లలో తను కూడా ఒకడిగా నిలిచాడు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన జోరు కాస్త తగ్గింది. ‘గుంటూరు కారం’ (Gunturu Karam) సినిమాతో డిజాస్టర్ ని మూట గట్టుకున్న ఆయన ఇప్పుడు అల్లు అర్జున్ (Allu Arjun) తో చేయవల్సిన సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ (Atlee) తో సినిమా చేస్తున్న సందర్భంగా త్రివిక్రమ్ (Trivikram) సినిమాని పక్కన పెట్టేశాడు. ఇక ఆ సినిమా అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఇక ఆ సినిమా పూర్తి అవ్వాలంటే దాదాపు రెండు సంవత్సరాల సమయం పడుతుంది. ఇక ఈ రెండు సంవత్సరాల కాలం లో త్రివిక్రమ్ ఖాళీగా ఉండే అవకాశాలైతే లేవు. కాబట్టి ఇప్పుడున్న హీరోల్లో ప్రతి ఒక్క హీరో చాలా బిజీగా ఉండడం వల్ల విక్టరీ వెంకటేష్ తో ఆయన ఒక సినిమా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ చాలా ఖాళీగా ఉన్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఆ తర్వాత ఎలాంటి సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావాలి అనే విషయంలో చాలా కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నాడు.
Also Read : అల్లు అర్జున్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇవ్వడం అతని అభిమానులను ఇబ్బంది పెడుతుందా..?
ఇక దానికి తగ్గట్టుగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ అతనికి ఒక కథను కూడా వినిపించారట. ఆ కథను ఫైనల్ చేసిన వెంకటేష్ ఇకమీదట చేయబోతున్న సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
అయితే పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా వస్తుందంటూ కొంతమంది కామెంట్లు చేస్తుంటే వెంకటేష్ తో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ ను తీసే ఉద్దేశ్యంలో త్రివిక్రమ్ ఉన్నాడంటూ మరికొన్ని వార్తలు వస్తున్నాయి.
వెంకటేష్ లాంటి స్టార్ హీరో దొరికితే కామెడీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తే బాగుంటుందని కొంతమంది త్రివిక్రమ్ కి సలహాలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ త్రివిక్రమ్ మాత్రం తను అనుకున్నది చేసి ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని ఆ తర్వాత మరో స్టార్ హీరోతో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో ‘నువ్వు నాకు నచ్చావ్ 2’ చేయబోతున్నారా..?