Homeఎంటర్టైన్మెంట్Toxic Movie Release Postponed: 'టాక్సిక్' విడుదల వాయిదా..సంచలనం రేపుతున్న హీరో యాష్ ట్వీట్..'ధురంధర్ 2'...

Toxic Movie Release Postponed: ‘టాక్సిక్’ విడుదల వాయిదా..సంచలనం రేపుతున్న హీరో యాష్ ట్వీట్..’ధురంధర్ 2′ కి భయపడ్డారా?

Toxic Movie Release Postponed: ఈ నెల 19 పై సినిమా అభిమానుల్లో చర్చ మామూలు రేంజ్ లో జరగలేదు. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ‘టాక్సిక్'(Toxic Movie), ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) చిత్రాలు ఆ రోజున విడుదల అవ్వబోతున్నాయి, సౌత్ ఇండియన్ సినిమా వెర్సస్ నార్త్ ఇండియన్ సినిమా, ఏది గెలుస్తుందో చూద్దాం అంటూ పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఒకపక్క బాలీవుడ్ వాళ్ళు ‘ధురంధర్ 2’ డైనోసార్ లాంటిది , ‘టాక్సిక్’ ని వాయిదా వేసుకుంటే బెటర్ అంటూ కామెంట్స్ చేశారు. దీనికి కౌంటర్ గా హీరో యాష్ ఫ్యాన్స్ మా సినిమాకే సౌత్ ఇండియన్ మార్కెట్ లో ఎక్కువ క్రేజ్ ఉంది, మీ సినిమా పోటీకి వస్తే నలిపేస్తాం అంటూ కౌంటర్లు వేశారు. ఇలా రెండు సినిమాల అభిమానులు సోషల్ మీడియా లో పరస్పరం ట్రోల్స్ వేసుకుంటూ ఉండేవాళ్ళు.

Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే

ఈ రెండు సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓవర్సీస్ లో మొదలయ్యాయి. ‘ధురంధర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్ కి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది ‘టాక్సిక్’. ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితమే హీరో యాష్ ‘టాక్సిక్ ‘ ని వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేసాడు. ఈ సందర్భంగా యాష్ మాట్లాడుతూ ‘టాక్సిక్ చిత్రాన్ని మేమంతా ఎన్నో ఏళ్ళు కష్టపడి నిర్మించాం. ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని కలిగించడానికి అహర్నిశలు కృషి చేసాం. మార్చి 19 న మా చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని ఎంతో ఆనందం తో ప్రకటించాము . కానీ ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవు. మిడిల్ ఈస్ట్ లో యుద్దాలు నడుస్తున్నాయి. ఇలాంటి సమయం లో మా సినిమాని విడుదల చేయడం కరెక్ట్ కాదని నిర్ణయం తీసుకున్నాము. అందుకే ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నాము. జూన్ 4 న విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు .

ఆయన వేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది. చాలా మంది చెప్పేది ఏంటంటే, ఈ సినిమాకు మార్కెట్ లో అనుకున్నంత బజ్ ఏర్పడలేదు, ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా డల్ గా ఉన్నాయి. ఇలాంటి సమయం లో ‘ధురంధర్ 2’ లాంటి క్రేజీ చిత్రంతో పోటీ పడితే, నష్టాలు తప్ప లాభాలు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే సినిమా ని వాయిదా వేశారు అంటూ చెప్పుకొస్తున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ, ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే ‘ధురంధర్ 2’ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయట. మరో రెండు రోజుల్లో ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular