Nani: అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ను స్టార్ట్ చేసిన హీరో నాని…కెరియర్ మొదట్లో ఎన్నో కష్టాలు పడి, అవకాశాల కోసం వేచి చూసి ఆకలేస్తే టీ, కాఫీ లతో కడుపు నింపుకునేవాడట. కడుపు కాలితే కానీ అవకాశం రాదు…కంట్లో నుంచి నీళ్ళు వస్తే గాని జీవితం విలువ తెలియదు అనడానికి నాని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి స్టార్ హీరోగా అవతరించాడు…అలాంటి నాని ఇప్పుడున్న స్టార్ హీరోలకు పోటీ ఇచ్చే స్థాయి కి ఎదిగాడు. అష్ట చమ్మ సినిమా నుంచి మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కి విస్తరించింది.
Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే
‘దసర’ సినిమా తో మాస్ అవతారం ఎత్తాడు. ‘ప్యారడైజ్’ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతున్నాడు…ఇక నానితో పాటు అతని పక్కన నటించే నటులు కూడా టాప్ హీరోలుగా రాణిస్తారనే విషయం చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది…’ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నాని ఫ్రెండ్ గా నటించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత స్టార్ హీరోగా మారాడు…ఇక ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమాలో నాని పక్కన నటించిన సిద్దు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ సినిమాతో హీరోగా మారాడు.
ప్రస్తుతం 100 కోట్ల హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు… ఇక ఇప్పుడు ‘హిట్ 3’ సినిమాలో ఆయన పక్కన నటించిన శ్రీనాథ్ మాగంటి సైతం ఇప్పుడు ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ గా ఉన్న నేపథ్యంలో తను కూడా విజయ్, సిద్దు మాదిరిగా స్టార్ హీరోగా అవతరిస్తాడా లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…
ఈ మూవీ ట్రైలర్ బాగుంది. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే మాదిరిగానే ఉంది. కాబట్టి ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని సినిమా యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అలాగే ప్రేక్షకులు సైతం ఈ సినిమాను చూడటానికి ఆసక్తిగా ఉన్నారు….మరి ఈ సినిమాతో శ్రీనాథ్ టాప్ హీరో అవుతాడా.? నాని పక్కన నటిస్తే స్టార్ హీరో అవ్వచ్చు అని నిరూపించినవాడు అవుతాడా? అనేది చూడాలి…